భారత హిందూ, ముస్లింలు ఖాన్‌లను ప్రేమిస్తారు: Kangana Ranaut

by Hajipasha |   (  Updated:2023-02-10 12:36:06  IST  )

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ 'పఠాన్' బాక్సాఫీస్ విజయం గురించి ఆసక్తికరమైన ట్వీట్ చేసింది.

భారత హిందూ, ముస్లింలు ఖాన్‌లను ప్రేమిస్తారు: Kangana Ranaut
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ 'పఠాన్' బాక్సాఫీస్ విజయం గురించి ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. ఈ మేరకు షారుఖ్, దీపిక 'బేషరమ్' సాంగ్ వస్తున్నపుడు థియేటర్లో ఫ్యాన్స్ చేస్తున్న రచ్చకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ పోస్ట్ చేస్తూ రాసిన క్యాప్షన్‌పై స్పందిస్తూ.. 'వెరీ గుడ్ అనాలిసిస్. దిస్ కంట్రీ హ్యాస్ ఓన్లీ అండ్ ఓన్లీ లవ్‌డ్ ఆల్ ఖాన్స్. కాబట్టి ముస్లిం నటీమణులపై మన ప్రజలకు మక్కువ ఉంది. భారతదేశాన్ని ద్వేషం, ఫాసిజం అని ఆరోపించడం చాలా అన్యాయం. భారత్ లాంటి దేశం యావత్ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా??' అంటూ తనదైన స్టైల్‌లో చెప్పుకొచ్చింది. అంతేకాదు హిందూ, ముస్లింలు షారుఖ్‌ను సమానంగా ప్రేమిస్తున్నందునే 'పఠాన్' విజయవంతమైందన్న కంగన.. ఈ సినిమా విజయంలో రాజకీయాలను లాగవద్దని, మూవీని మాత్రమే ఆస్వాదించాలని బాలీవుడ్‌ను హెచ్చరించింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.

READ MORE

Vishwak Sen : గుండె మీద చేయి వేసుకుని సినిమాకి రండి: 'బుట్ట బొమ్మ పై విశ్వక్ సేన్

Next Story