- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండస్ట్రీలో నటీనటుల ప్రతిభ కాకుండా రంగు చూస్తున్నారు.. ప్రియమణి సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్ నటి ప్రియమణి(Priyamani) గత ఏడాది మైదాన్, భామా కలాపం వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది.

దిశ, సినిమా: టాలీవుడ్ నటి ప్రియమణి(Priyamani) గత ఏడాది మైదాన్, భామా కలాపం వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఈ అమ్మడు దళపతి విజయ్ ‘జన నాయగన్’(Jana Nayagan)మూవీలో కీలక పాత్రలో కనిపించనుంది. హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య రాబోతుంది. రాజకీయ యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతుంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. అయితే ప్రియమణి ఓ వైపు షూటింగ్‌లో పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉంటుంది. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియమణి బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘‘బాలీవుడ్‌లో కొందమంది దర్శకులు నన్ను చూసి సౌత్ ఇండియన్ క్యారెక్టర్ ఉంది కాబట్టి మిమ్మల్ని తీసుకుంటున్నాము అని చెప్పారు. అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది.
మేము నిజంగానే దక్షిణాది వాళ్లం అయినా అన్ని భాషలు మాట్లాడగలం అని చెప్పాను. ఉత్తరాది నటీమణుల మాదిరిగా తెల్లగా ఉండకపోవచ్చు కానీ అందంగా ఉంటామని ధైర్యంగా చెప్పగలుగుతాము. చర్మ రంగు ముఖ్యం కాదు ప్రతిభే ప్రధానం. కానీ దురదృష్టవశాత్తు బాలీవుడ్‌లో ఇప్పటికీ పాత్రలు ఇస్తున్న నటీనటుల రంగు, ప్రాంతం వంటి విషయాలను పరిగణలోకి తీసుకుని అవకాశం ఇస్తున్నారు. నటనకు, ప్రతిభకు చర్మ రంగుతో, ప్రాంతంతో సంబంధం లేదని గుర్తిస్తే మంచిది’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ప్రియమణి కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.






