- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vaishnavi Chaitanya : టాలీవుడ్ చరిత్రలోనే ‘బేబీ’ బ్యూటీకి బంపర్ ఆఫర్..!
ఇండస్ట్రీలో మెలగాలంటే అందంతో పాటు అదృష్టం కూడా ఉండాలి.

దిశ, వెబ్‌డెస్క్: ఇండస్ట్రీలో మెలగాలంటే అందంతో పాటు అదృష్టం కూడా ఉండాలి. ఈ మాటను అక్షరాల నిజం చేస్తున్నారు ఈ మధ్య కాలంలో వచ్చిన హీరోయిన్లు. యూట్యూబ్, వెబ్ సీరిస్, సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ.. ఒక్కసారిగా మంచి ఫాములోకొచ్చిన బ్యూటీ వైష్టవి చైతన్య. ‘బేబీ’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా ఎదిగిన ఈ ముద్దుగుమ్మ.. ఏ స్టార్ హీరోయిన్ దక్కించుకోలేని అరుదైన అవకాశాన్ని అందుకుందట.
బేబీ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌తో.. వరుస సినిమా ఆఫర్స్ ఆమె చెంతకు చేరాయని సమాచారం. అలా వచ్చిన అవకాశాల్లో ఇప్పటికే రెండు సినిమాలకు ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఓ అరుదైన అవకాశం కూడా ఆమె చెంతకు చేరింది. అదేంటంటే.. దివంగత నటి, స్టార్ హీరోయిన్ సౌందర్య బయోపిక్ తీస్తున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా మెయిన్ లీడ్‌లో నటించే ఛాన్స్ వైష్ణవి పట్టేసినట్టు సోషల్ మీడియాలో ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. ఏ పాత్రలోనైనా ఒదిగి నటించడంతో పాటు.. అచ్చ తెలుగు అమ్మాయి కావడంతో ఈ అవకాశం వైష్ణవికి దక్కినట్లు నెట్టింట ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.






