Director Maha Venkatesh : నా దృష్టిలో వాళ్లంతా మనుషులే కాదు.

by Chukka Sudharani |   (  Updated:2023-10-28 13:28:02  IST  )

‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాతో డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వెంకటేష్ మహా.

Director Maha Venkatesh : నా దృష్టిలో వాళ్లంతా మనుషులే కాదు.
X

దిశ, సినిమా: ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాతో డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వెంకటేష్ మహా. ప్రజంట్ సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన ‘మార్టిన్ లూథర్ కింగ్’ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వెంకటేష్.. గతంలో తనపై వచ్చిన విమర్శలపై స్పందించాడు. ‘నాకు ఏ విషయంలోనూ కాంట్రవర్సీలు లేవు. కానీ కొంతమంది సోషల్ మీడియాలో నాపై విమర్శలు చేశారు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా నేను చాలామందిని కలిశాను. ఎక్కడ కూడా నాకు ఈ విషయం గురించి ప్రశ్నలు ఎదురు కాలేదు. కొందరు చేసే హడావుడిని నేను పట్టించుకోను. నా దృష్టిలో అలాంటి వాళ్లు మనుషులే కాదు. ఇండస్ట్రీలోకి నేను ఏదో పబ్లిసిటీ కోసం రాలేదు. నా కథలను చెప్పి సినిమాలు చేసుకోవడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాను’ అంటూ వెంకటేష్ చెప్పుకొచ్చాడు.

Next Story