ఆకట్టుకుంటున్న జగపతి బాబు ‘రుద్రంగి’ టీజర్..

by Disha Web Desk 6 |
ఆకట్టుకుంటున్న జగపతి బాబు ‘రుద్రంగి’ టీజర్..
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు నటించిన చిత్రం ‘రుద్రంగి’. ఇందులో ఆశిష్ గాంధీ, మమతా మోహన్ దాస్, విమల రామన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. దీనికి అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. తాజాగా, ఈ మూవీ నుంచి టీజర్ విడుదలైంది. స్వతంత్రం తర్వాత ఆనాటి తెలంగాణ సాంఘీక పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రం కనిపిస్తుంది. జగపతి బాబు భీం రావ్ దేశ్ ముఖ్ అనే క్రూరమైన దొర పాత్రలో కనిపిస్తున్నాడు. స్వాతంత్రం మాకే కానీ బానిసలకు కాదు, వాడు బలవంతుడు కావొచ్చు కానీ నేను భగవంతుడిని అని చెప్పే డైలాగ్ ద్వారా జగపతి బాబు పాత్ర ఎంత క్రూరంగా ఉంటుందనేది అర్థమవుతోంది. రసమయి బాలకిషన్‌ నిర్మించిన ఈ సినిమా సమ్మర్‌ కానుకగా మే 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Next Story

Most Viewed