- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్పెర్మ్ కౌంట్ పెంచుకోవడానికి హీరో కష్టాలు.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
ఏబీసీడీ, అహ నా పెళ్లంట తర్వాత దర్శకుడు సంజీవ్ రెడ్డి మరో కొత్త కథతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయ్యాడు. ప్రస్తుతం చాలా మంది దంపతులు ఎదుర్కొంటున్న సమస్య సంతానలేమి.

దిశ, సినిమా : ఏబీసీడీ, అహ నా పెళ్లంట తర్వాత దర్శకుడు సంజీవ్ రెడ్డి మరో కొత్త కథతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయ్యాడు. ప్రస్తుతం చాలా మంది దంపతులు ఎదుర్కొంటున్న సమస్య సంతానలేమి. స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటం, కదలిక లేకపోవడం వలన చాలా మందికి సంతానం కలగడం లేదు. దీంతో ఈ ఇష్యూనే దర్శకుడు వినోదాత్మకంగా చూపించనున్నాడు. సంతాన ప్రాప్తిరస్తు అంటూ ఉన్న ఈ మూవీ టైటిల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
కాగా, ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మూవీ టీమ్. హీరో పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినట్లు సమాచారం. యంగ్ హీరో విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా, ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లొ హీరో చేతిలో స్పెర్మ్ కౌంట్ పెంచుకునేందుకు ఏం చేయాలి అనే బుక్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, యోగా, వ్యాయామం చేయడానికి మ్యాట్, సిరప్, మెడిసన్స్ కనిపిస్తున్నాయి. దీని బట్టి చూస్తే హీరో స్పెర్మ్ కౌంట్ పెంచుకోవడానికి ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఈ పోస్టర్ నెటిజన్స్‌ను ఎంతగా ఆకట్టుకుంటుంది.
Meet @ThisIsVikranth as 𝐂𝐡𝐚𝐢𝐭𝐚𝐧𝐲𝐚 from the world of #SanthanaPrapthirasthu – Where flaws are the New Perfect! ❤️🔥
— GSK Media (@GskMedia_PR) July 30, 2024
A @kasyapsunil6 Musical 🎹@iChandiniC @sanjeevflicks @madhurasreedhar #NirviHariPrasadReddy @MahiBrahmareddy @SheikDawoodG1 #AMadhusuddhanReddy… pic.twitter.com/cWoDQWUvIQ






