- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫిల్మ్ ఛాంబర్‌లో కీలక సమావేశం.. ఎగ్జిబిటర్లు, నిర్మాతల వివాదానికి చెక్ పడుతుందా?
హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్‌లో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎగ్జిబిటర్లు, నిర్మాతలతో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చర్చలు జరుపుతోంది. ఇప్పటికే ఛాంబర్ ప్రెసిడెంట్ డి సురేష్ బాబు, నిర్మాతలు దిల్ రాజు, చెరుకూరి శ్రీనివాసరావు, భోగవల్లి బాపినీడు, స్రవంతి రవికిశోర్, సుధాకర్ రెడ్డి, ఠాగూర్ మధు, రాధామోహన్ అక్కడకు చేరుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్‌లో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎగ్జిబిటర్లు, నిర్మాతలతో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చర్చలు జరుపుతోంది. ఈ సమావేశానికి ఛాంబర్ ప్రెసిడెంట్ డి సురేష్ బాబు, నిర్మాతలు దిల్ రాజు, సుప్రియయార్లగడ్డ, అల్లు అరవింద్, మైత్రీ చెర్రీ, మైత్రీ రవి, నాగవంశీ, చెరుకూరి శ్రీనివాసరావు, భోగవల్లి బాపినీడు, స్రవంతి రవికిశోర్, సుధాకర్ రెడ్డి, ఠాగూర్ మధు, రాధామోహన్ హాజరయ్యారు. చాంబర్ అధ్యక్షుడు డి. సురేష్ బాబు నేతృత్వంలో ఇరు వర్గాల సమస్యలపై సమగ్రంగా చర్చించనున్నారు. ప్రధానంగా పర్సంటేజ్ విధానం, రెంటల్ సిస్టమ్, ఓటీటీ విండో అంశాలు సమావేశంలో కీలకంగా మారనున్నాయి. ఈ సమావేశానికి తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, కార్యదర్శి, ఏపీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, కార్యదర్శితో పాటు గిల్డ్ నిర్మాతల తరఫున ముగ్గురు సభ్యులు హాజరుకానున్నారు. మొత్తం 10 మంది సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు. అయితే సమావేశంలో ప్రారంభమైన పది నిమిషాలు రచ్చరచ్చ జరిగింది. సునీల్ నారంగ్, నాగవంశీ వ్యక్తిగత దూషణలు చేసుకున్నారు. ఇరువురు గట్టిగట్టిగా అరుచుకోవడంతో దిల్ రాజు వారిని అదుపుచేసే ప్రయత్నం చేశారు. చివరికి సునీల్ నారంగ్ మధ్యలనే సమావేశం నుండి వెళ్లిపోయారు. దీంతో ఆయనను ఇతర నిర్మాతలు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే గత కొద్దిరోజులుగా ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య పర్సంటేజ్ వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సింగిల్ స్క్రీన్ థియేటర్లకు రెంట్ కాకుండా సినిమా కలెక్షన్లలో పర్సంటేజీ ఇవ్వాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. అలా పర్సంటేజీలు ఇస్తే తమకు నష్టాలు వస్తాయని ఇవ్వలేమని నిర్మాతలు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో చాలా సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఏషియన్ సునీల్, శిరీశ్, సురేష్ బాబు, అల్లు అరవింద్, అన్నపూర్ణ స్టూడియోస్ లాంటి పెద్దల చేతుల్లోనే ఉన్నాయి. ఇప్పుడు పర్సంటేజీ కావాలని కూడా వీళ్లే డిమాండ్ చేస్తున్నారు. దీంతో ముందు ఆ థియేటర్లలో సరైన వసతులు కల్పించాలని అప్పుడు పర్సంటేజీ ఇస్తామని నిర్మాతలు వాదిస్తున్నారు. ఈ వివాదం ముదిరి ముదిరి నిర్మాత నాగవంశీని బాడీ షేమింగ్ చేసేవరకు చేరుకుంది. దీంతో ఫిల్మ్ ఛాంబర్ హుటాహుటిన రంగంలోకి దిగి సమావేశం ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.






