- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కామెడీ చేయడం ఎంత కష్టమో నాకు ఇప్పుడిప్పుడే అర్ధమవుతుంది: కయాదు లోహర్
కోలీవుడ్ యంగ్ బ్యూటీ కయాదు లోహర్(Kayadu Lohar) ఇటీవల ‘డ్రాగన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

దిశ, సినిమా: కోలీవుడ్ యంగ్ బ్యూటీ కయాదు లోహర్(Kayadu Lohar) ఇటీవల ‘డ్రాగన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళంలో వరుస ప్రాజెక్ట్స్ సొంతం చేసుకుంటూ క్రేజీ బ్యూటీగా మారిపోయింది. త్వరలో ఈ అమ్మడు టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది. విశ్వక్ సేన్(Vishwak Sen), అనుదీప్ కాంబోలో రాబోతున్న ‘ఫంకీ’(Funky) చిత్రంలో నటిస్తోంది. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కయాదు లోహర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘‘ప్రజెంట్ నేను అనుదీప్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను.
ఈ మూవీ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతుంది. అయితే ఈ సినిమా డైలాగ్స్ అన్ని షూటింగ్ స్పాట్‌లో ఆలోచించి రాసినవే. ప్రతి ఐదు నిమిషాలకు వచ్చే సీన్ చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. కామెడీ చేయడం ఎంత కష్టమో ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది. దానికి భాష కూడా ముఖ్యమే. భాష తెలిసినప్పుడే దాని అర్థమెంటో తెలుస్తుంది. కామెడీ కూడా సహజంగానే వస్తుంది. నాకు నవ్వించే స్వభావం ఉందని నమ్ముతా. కానీ కామెడీ చేయాల్సి వస్తే మాత్రం అది చాలా కష్టమైన పనిగా భావిస్తా.
చూసేటప్పుడు తేలికగా ఉన్నా.. షూటింగ్ సమయంలో చాలా కష్టంగా అనిపిస్తుంది. ప్రతీ పంచ్ సరిగ్గా వేయాలి.. ప్రతీ టేక్‌ను సరిగ్గా వచ్చేలా చూసుకోవాలి. అనుదీప్ గారు స్క్రిప్ట్‌పై ఆధారపడకుండానే చాలా డైలాగ్స్ రాస్తుంటారు. నాకు ఒక డైలాగ్ ఉందంటే.. మళ్లీ ఐదు నిమిషాల తర్వాత ఓ డైలాగ్ వస్తుంటుంది. నా భాష అస్సామీలో చేస్తే అంత కష్టంగా అనిపించదు.. కానీ వేరే భాషలో చేయాలంటే చాలా కష్టం’’ అని చెప్పుకొచ్చింది. ఇక ఈ అమ్మడు ‘ఫంకీ’ గురించే చెప్పిందని అంతా చర్చించుకుంటున్నారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోయింది.






