నేను అబద్ధాలు చెప్పే రకం కాదు.. సర్జరీ చేయించుకోవడంపై యంగ్ హీరోయిన్ ఆసక్తికర పోస్ట్

by Mallepaka Hamsa |

చాలా మంది నేను ఏదో సర్జరీ చేయించుకున్నానని అనుకుంటున్నారు. నాకు ముక్కు, పెదవుల సర్జరీ గురించి వరుసగా కామెంట్స్ వస్తున్నాయి.

నేను అబద్ధాలు చెప్పే రకం కాదు.. సర్జరీ చేయించుకోవడంపై యంగ్ హీరోయిన్ ఆసక్తికర పోస్ట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అలయ ఎఫ్ తనపై వస్తున్న ప్లాస్టిక్ సర్జరీ వార్తలను తీవ్రంగా ఖండించారు. ఇటీవల ముంబైలో జరిగిన 'లాక్మే ఫ్యాషన్ వీక్'లో ఆమె ర్యాంప్ వాక్ చేసిన తర్వాత, ఆమె ముఖంలో మార్పు వచ్చిందని, ముఖ్యంగా ముక్కు, పెదవులకు సర్జరీ చేయించుకుందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. తాజాగా, ఈ విషయంపై అలయ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియో షేర్ చేస్తూ క్లారిటీ ఇచ్చింది. "చాలా మంది నేను ఏదో సర్జరీ చేయించుకున్నానని అనుకుంటున్నారు. నాకు ముక్కు, పెదవుల సర్జరీ గురించి వరుసగా కామెంట్స్ వస్తున్నాయి. కానీ నేను ఎలాంటి సర్జరీ చేయించుకోలేదు, ఇది నా ప్రామిస్. ఒకవేళ నేను చేయించుకుని ఉంటే, ఆ విషయాన్ని దాచాల్సిన అవసరం నాకు లేదు. గర్వంగా అందరికీ చెప్పేదాన్ని. అబద్ధాలు చెప్పే రకం కాదు" అని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇక తన ముఖంలో కనిపిస్తున్న మార్పుపై ఆమె స్పందిస్తూ.. "ఇది అదే పాత ముక్కు, అవే పెదవులు. బహుశా డిఫరెంట్ లైటింగ్ వల్ల మీకు అలా అనిపించి ఉండవచ్చు. లేదా సరైన ఆహారం, హైడ్రేషన్ మరియు రెగ్యులర్ ఫేస్ మసాజ్‌ల వల్ల నా ముఖం కాస్త తాజాగా కనిపిస్తుండవచ్చు. మీరు అనుకున్నట్లుగా నేను మాత్రం సర్జరీ చేయించుకోలేదు" అని స్పష్టం చేశారు.

Next Story