ఆ బోల్డ్ ఫొటోలు నా కొడుకు చూస్తాడని భయంగా ఉంది.. ఇలాంటి చీప్ ట్రిక్స్ మానుకోండంటూ నటి షాకింగ్ పోస్ట్

by Mallepaka Hamsa |

మరాఠి నటి గిరిజ ఓక్(Girija Oak) సడెన్‌గా పాపులర్ అయిపోయింది.

ఆ బోల్డ్ ఫొటోలు నా కొడుకు చూస్తాడని భయంగా ఉంది.. ఇలాంటి చీప్ ట్రిక్స్ మానుకోండంటూ నటి  షాకింగ్ పోస్ట్
X

దిశ, సినిమా: మరాఠి నటి గిరిజ ఓక్(Girija Oak) సడెన్‌గా పాపులర్ అయిపోయింది. పలు భాషల్లో సినిమాలు చేసిన ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ‘కాంతార’ నటుడి గుల్షన్ దేవయ్య (Gulshan Devaiah)పై ప్రశంసలు కురిపించింది. ఇక కొద్ది రోజులకే సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిపోయింది. ఆమె ఇంటర్వ్యూ క్లిప్స్ కోసం జనాలు నెట్టింట సెర్చ్ చేస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు. అలాగే గిరిజ పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన వివరాలు, బోల్డ్ ఫొటోలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈక్రమంలో.. తాజాగా, గిరిజ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియోను షేర్ చేసి అసలు విషయాలు రివీల్ చేసింది. ‘‘నా ఫొటోలు మార్ఫింగ్ చేసి బోల్డ్‌గా ఉన్నట్లుగా చేసి వైరల్ చేస్తున్నారు. ఏఐను ఉపయోగించి చేసిన ఫొటోలు చూడటానికి అసౌకర్యంగా ఉన్నయి. ఇష్టమొచ్చినట్లు ఎడిట్ చేస్తూ, హద్దులు దాటుతున్నారు. అదే నాకు వచ్చిన పెద్దగా సమస్యగా మారింది. నాకు 12ఏళ్ల కొడుకు ఉన్నాడు.

ప్రస్తుతానికైతే సోషల్ మీడియా వాడడు. కానీ ఎప్పుడైనా ఈ ఆన్‌లైన్ ప్రపంచంలోకి వచ్చినప్పుడు నా ఫొటోలు చూస్తాడని భయంగా ఉంది. మా అమ్మ అభ్యంతరకర ఫొటోలు సోషల్ మీడియాలో ఉన్నాయేంటి? అని వాడు బాధపడతాడన్న ఆలోచనే నన్ను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. వ్యూస్ కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ మానుకోండి. ఒకమ్మాయి ఫొటోలను ఇలా ఎడిట్ చేసేముందు ఒక్కసారి ఆలోచించడం మంచిది. అలాంటి ఎడిటింగ్ ఫొటోలను చూసి ఆస్వాదించేవారిది కూడా తప్పే. దయచేసి అలాంటివి వైరల్ చేయడం ఆపేయండి. నా సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూడటం మంచిదే. కానీ ఇలాంటి ఫొటోలను అసౌక్యంగా చేసి ఇబ్బంది పెట్టడం సరికాదు’’ అని చెప్పుకొచ్చింది. ఇక ఈ వీడియోతో క్లారిటీ రావడంతో నెటిజన్లు ఆమె ధైర్యం చెబుతూ సపోర్ట్‌గా నిలుస్తున్నారు. నిందితులను పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story