- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ సమయంలో మానసికంగా దెబ్బతిన్నా.. చాలా ఇబ్బందులు పడ్డానంటూ ఇలియానా ఎమోషనల్ కామెంట్స్
గోవా బ్యూటీ ఇలియానా (Ileana)ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి ఇండస్ట్రీని షేక్ చేసింది.

దిశ, సినిమా: గోవా బ్యూటీ ఇలియానా (Ileana)ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి ఇండస్ట్రీని షేక్ చేసింది. ‘పోకిరి’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆమె తెలుగు, హిందీ చిత్రాల్లో నటించి తన అందం, అభినయంతో ఊహించని ఫేమ్ తెచ్చుకుని కొద్ది కాలంపాటు స్టార్ హీరోయిన్‌గా రాణించింది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉండగానే..అమెరికా నటుడు మైఖేల్ డోలన్‌ను సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంది. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచిన ఆమె తన మొదటి బిడ్డకు 2023లో జన్మనిచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈక్రమంలోనే అంతా తన భర్త గురించి ప్రశ్నించడంతో అతని ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి అధికారికంగా ప్రకటించింది.
ఇక మొదటి బిడ్డ పుట్టిన తర్వాత నుంచి సినిమాలకు దూరంగా ఉంటుంది. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ తన జీవితానికి సంబంధించిన విషయాలు ప్రేక్షకులతో పంచుకుంటుంది. ఇక ఇటీవల ఇలియానా తను రెండో సారి తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూలైలో రెండో బిడ్డను కూడా కనేసింది. ప్రస్తుతం పలు ఇంటర్వ్యూలో పాల్గొంటూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడంపై, తనకు ప్రసవం సమయంలో ఎదురైన సందర్భాలను పంచుకుంటుంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఇలియానా ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ‘‘మొదటి సారి బిడ్డకు జన్మనిచ్చిన సమయంలో చాలా జాగ్రత్తగా చూసుకున్నాను.
అలాగే ఒంటరిగా బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడుకున్నాను. కానీ రెండోసారి కేవలం బిడ్డనే కాదు.. నాతో పాటు మరో ఇద్దరు చిన్న పిల్లల బాధ్యత నాదే. ఇలాంటి సందర్భాల్లో మనం శారీరకంగా.. బలాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నించాలి. ఆ సమయంలో మానసికంగా పూర్తిగా గందరగోళంగా అనిపించింది. చాలా కష్టతరంగా ఫీలయ్యాను. ఏం జరగబోతుందో తెలిసినప్పటికీ మానసికంగా ఇబ్బందులు పడ్డాను. అదే సమయంలో ముంబైని చాలా మిస్సయిన బాధ కూడా ఉండేది. అక్కడైతే నాకు సాయం చేసేందుకు నా ఫ్రెండ్స్ ఉండేవారు. ఇక్కడ ఒక్కదాన్ని కావడం వల్ల నా పిల్లలను చూసుకోవడానికి కష్టం అవుతుంది’’ అని చెప్పుకొచ్చింది.






