- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో అద్భుతానికి శ్రీకారం చుట్టిన ఇళయరాజా.. పోస్ట్ వైరల్
ఇదొక అద్భుతమైన ఆధ్యాత్మిక కలయిక. సంగీతం ఇప్పుడు భగవంతుడికి నేను సమర్పిస్తున్న ఒక నైవేద్యం అంటూ తన మనసులోని మాటను పంచుకున్నారు.

దిశ, సినిమా: వయసుతో సంబంధం లేకుండా తన అద్భుతమైన స్వరాలతో మంత్రముగ్ధులను చేసే ఇళయరాజా, ఇప్పుడు మరో గొప్ప ఆధ్యాత్మిక ప్రాజెక్ట్‌కు సిద్ధమయ్యారు. బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'వాల్మీకి రామాయణం' చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందించబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఇళయరాజా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. "ఇదొక అద్భుతమైన ఆధ్యాత్మిక కలయిక. సంగీతం ఇప్పుడు భగవంతుడికి నేను సమర్పిస్తున్న ఒక నైవేద్యం" అంటూ తన మనసులోని మాటను పంచుకున్నారు. రామాయణం వంటి గొప్ప ఇతిహాసానికి, ఇళయరాజా వంటి దిగ్గజ సంగీత దర్శకుడు బాణీలు కడుతుండటం అనేది సంగీత ప్రియులకు పండుగలాంటి వార్త. ఆయన ఇచ్చే నేపథ్య సంగీతం ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుందని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని భావనా తల్వార్ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు.
వాల్మీకి మహర్షి రచించిన అసలు సిసలు రామాయణ గ్రంథాన్ని ఆధారంగా చేసుకుని, ఎక్కడా మార్పులు లేకుండా అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రామాయణంలోని ప్రతి ఘట్టాన్ని కూడా ప్రేక్షకులకు కళ్ళకు కట్టినట్లు చూపించేందుకు దర్శకురాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆధునిక కాలంలో ఇతిహాసాలను కమర్షియల్ హంగులతో కాకుండా, అసలు మూలానికి కట్టుబడి తెరకెక్కించడం ఈ సినిమా ప్రత్యేకత కానుంది. ఈ భారీ పౌరాణిక చిత్రం 2026 అక్టోబర్ 2న, గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక రామాయణ ప్రాజెక్టులు వస్తున్నా, ఇళయరాజా సంగీత, వాల్మీకి రాసిన ఒరిజినల్ కథాంశం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రయాణానికి వేదిక కాబోతున్న ఈ చిత్రం కోసం రామభక్తులు, సంగీత అభిమానులు ఎంతో ఉత్సాహంగా వేచి చూస్తున్నారు. మాస్ట్రో ఇళయరాజా అందించబోయే ఆ మధురమైన స్వరాలు థియేటర్లలో ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళ్లడం ఖాయం.






