- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయిలో ఈ రెండూ చూడాల్సిందే.. తప్పు లేదంటూ నటి షాకింగ్ కామెంట్స్
బుల్లితెర నటి వాబిజ్ దొరబ్జీ (Vahbbiz Dorabjee)పలు సిరీయల్స్‌లో నటించి పలు అవార్డులు కూడా పొందింది.

దిశ, సినిమా: బుల్లితెర నటి వాబిజ్ దొరబ్జీ (Vahbbiz Dorabjee)పలు సిరీయల్స్‌లో నటించి పలు అవార్డులు కూడా పొందింది. ఈక్రమంలోనే.. వివియన్ డిసేనతో ప్రేమలో పడి 2013లో పెళ్లి చేసుకుంది. ఓ వైపు పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే సీరియల్స్‌లోనూ నటించింది.కానీ దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత తన భర్తతో మనస్పర్థలు రావడంతో 2021లో విడాకులు తీసుకుంది. ఇక ఆ తర్వాత సీరియల్స్ చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తోంది. గత ఏడాది ‘దివానియాత్’(Diwaniyat)లో బబితా చౌదరి పాత్రలో నటించి ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. కానీ ఆ తర్వాత ఎలాంటి టీవీ సీరియల్‌లో కనిపించలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఇక గత కొద్ది కాలంగా ఆమె భారీ భరణం డిమాండ్ చేసిందని పలు పుకార్లు షికారు చేస్తున్నాయి.
ఈనేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో భాగంగా వాబిజ్ స్పందించింది. ‘‘నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. నా కుటుంబ నాకు సపోర్ట్‌గాఉంది కాబట్టి ఇలా జీవిస్తున్నాను. మహిళలకు నేను చెప్పేది ఒక్కటే.. పెళ్లి చేసుకునే వారు తమ భర్త దగ్గర ఆర్థిక భద్రత ఉందా? అనే అని చూసుకుంటుంది. అంతమాత్రాన తను డబ్బు కోసమే పురుషులతో సంబంధం పెట్టుకుందని అనొద్దు. నిజానికి నేటి కాలంలో పురుషులు కూడా అదృష్టవంతులు. ఈ రోజుల్లో మహిళలు కూడా బాగానే సంపాదస్తున్నారు. మీతో సమానంగా చేస్తున్నారు. అందులో ఎటువంటి తప్పు లేదా చెడు కనిపించదు.
జీవిత భాగస్వామి దగ్గర స్థిరత్వాన్ని, ఆర్థిక భద్రతను కోరుకోవడం తప్పేం కాదు. దానికి గోల్డ్ డిగ్గర్ అని ముద్ర వేస్తున్నారంటే వారికి ఆ పదానికి అర్థం తెలియనట్లే. చాలామంది మగవారు అమ్మాయి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే పెళ్లి చేసుకుంటారు. వారికి డబ్బు అవసరమైనప్పుడల్లా ఆడవారిని అడుగుతారు. అలాంటి వాళ్లు చాలా డేంజర్ స్త్రీలు జాగ్రత్తగా ఉండండి. అలాంటి అనుభవాలు నాకూడా జరిగాయి. కొంతమంది నా దగ్గర కూడా డబ్బులు కొట్టేయాలని చూశారు. అలాంటి వాళ్లని గోల్డ్ డిగ్గర్ అనొచ్చు’’ అని చెప్పుకొచ్చింది.






