అలాంటి సినిమాలు చేస్తే.. ప్రేక్షకులను థియేటర్స్‌కు తీసుకురావడం చాలా కష్టం: ఐశ్వర్య రాజేష్

by Mallepaka Hamsa |

తెలుగు, తమిళ,మలయాళ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అలాంటి సినిమాలు చేస్తే.. ప్రేక్షకులను థియేటర్స్‌కు తీసుకురావడం చాలా కష్టం: ఐశ్వర్య రాజేష్
X

దిశ, సినిమా: తెలుగు, తమిళ,మలయాళ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా లేడీ ఓరియెంటెడ్ కథల్లోనూ నటించిన ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) వరుస చిత్రాల్లో నటిస్తూ పలు హిట్స్ తన ఖాతాలో వేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక ఇటీవల ఆమె తెలుగులో నటించిన ‘సంక్రాంతి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam)బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఒక్కసారిగా అమ్మడు రేంజ్ మారిపోయింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చి బాక్సాఫీసును షేర్ చేసింది. దీంతో ఇందులో హీరోయిన్‌గా నటించిన ఐశ్వర్య పాపులారిటీ మరింత పెరిగిందని చెప్పాలి. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కూడా కనిపించి మెప్పించింది. ప్రేక్షకులను మెప్పించడమే కాక భారీ కలెక్షన్లు కూడా రాబట్టి హిట్ చిత్రాల లిస్ట్‌లో చేరింది.

ఐశ్వర్య ఫేమ్ భారీగా పెరగడంతో ప్రజెంట్ వరుస అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఉత్తరఖాండ్ చిత్రంతో కన్నడ ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ డిసెంబర్ 7న రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాతో పాటు ఐశ్వర్య రాజేష్, తీరువీర్ సరసన ఓ కొత్త ప్రాజెక్ట్ చేస్తోంది. భరత్ దర్శన్ తెరకెక్కించనున్న ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తి కాగా.. త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు టాక్. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ఐశ్వర్య రాజేష్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘నా మాతృభాష తెలుగు అయినప్పటికీ, తమిళం, మలయాళంలో నాకు అతిపెద్ద విజయాలు లభించాయి. ‘సంక్రాంతికి వస్తున్నం’ సినిమాతో నా కోరిక తీరింది.

మంచి తెలుగు మూవీస్ చేయాలనే బాధ్యత నాకు ఉంది. కానీ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయడం ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు మంచిది కాదనిపిస్తోంది. ఎందుకంటే.. గత కొన్నాళ్లుగా ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడం చాలా కష్టం అయింది. అలాంటిది మహిళా ఆధారిత చిత్రాలను చూస్తారని భ్రమ పడొద్దు. ఎప్పుడూ చేసేవి కాకుండా విభిన్న పాత్రలు చేయాలనుకుంటున్నాను. ఇక నుంచి అలాంటి సినిమాలే ఒప్పుకోవాలనుకుంటున్నా’’ అని చెప్పింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా.. ఐశ్వర్య చెప్పినట్లుగానే చాలామంది ఓటీటీల్లో చూస్తే థియేటర్స్‌కు వెళ్లడం మానేశారు. ఎంచక్కా ఇంట్లోనే కొత్త చిత్రాలను కుటుంబంతో కలిసి చూస్తు్న్నారు. థియేటర్స్‌లోకి వెళితే అధిక మొత్తంలో డబ్బులు ఖర్చుపెట్టాల్సి వస్తుందని చెప్పి ఓటీటీలో లేదా పైరసీలో చూసేస్తున్నారు.

Next Story