యాంకర్ ప్రదీప్‌కు ప్రపోజ్ చేసిన హీరోయిన్ ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

by Disha Web Desk 9 |
యాంకర్ ప్రదీప్‌కు ప్రపోజ్ చేసిన హీరోయిన్ ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
X

దిశ, వెబ్‌డెస్క్: అద్భుతమైన టైమింగ్‌తో సత్తా చాటుతోన్న స్టార్ యాంకర్ ప్రదీప్ గురించి పరిచయం అక్కర్లేదు. ఎన్నో షోలకు యాంకర్‌గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుని టాప్ యాంకర్‌‌గా నిలిచాడు. కాగా ప్రస్తుతం ‘‘సరిగమప’’, ‘సర్కారు’ షోస్‌కి యాంకర్‌గా చేస్తున్నాడు. అయితే తాజాగా సర్కారు షోకు ‘‘ అన్ని మంచి శకునములే’’ చిత్రం నుంచి టీమ్ మెంబర్స్.. డైరెక్టర్ నందినిరెడ్డి, హీరో శోభన్, హీరోయిన్ మాళవిక నాయర్ హాజరయ్యారు. కాగా గేమ్ మధ్యలో హీరోయిన్ మాట్లాడుతూ.. ‘ప్రదీప్ షోస్ చూస్తుంటే నాకు ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉంటుందని చెప్పారు.’

తర్వాత ప్రదీప్ తనతో దాగుడు మూతలు ఆట ఆడిపించాడు. దీంతో నందిని స్పందించి.. ‘నాకు ఎందుకో ఈ మొత్తం ప్రొసీజర్‌లో యాంకర్ నీకు లైన్ వేస్తున్నట్లు డౌట్‌గా ఉందని చెప్పడంతో’ వెంటనే క్యాలీ ఫ్లవర్ తీసుకొని మాళవిక ప్రదీప్‌కు ప్రపోజ్ చేశారు. దీంతో ప్రదీప్ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఇకపై తాను క్యాలీ ఫ్లవర్‌ను కూడా ఫ్లవర్ జాబితాలో చేర్చుతానని చెప్పడంతో ఒక్కసారిగా షోలో నవ్వులు పూయించింది. కాగా.. మాళవిక ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్, దానికి ప్రదీప్ రియాక్షన్ హైలైట్‌ అయ్యింది. ప్రస్తుతం ఈ ప్రొమో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారింది.

Read more:

గులాబీ రంగు గౌనులో మైమరపించిన ఊర్వశి.. విశ్వానికే అందగత్తెవంటున్న ఫ్యాన్స్

Next Story

Most Viewed