అక్కినేని నాగేశ్వరరావు మొదటి సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

by Chukka Sudharani |   (  Updated:2023-09-20 16:34:10  IST  )

అక్కినేని నాగేశ్వరరావు తెలుగు చిత్ర పరిశ్రమకు చేసిన సేవలు చిరస్మరణీయం.

అక్కినేని నాగేశ్వరరావు మొదటి సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
X

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని నాగేశ్వరరావు తెలుగు చిత్ర పరిశ్రమకు చేసిన సేవలు చిరస్మరణీయం. నటుడిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా తెలుగు సినిమా అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. రంగస్థలంపై మొదలైన ఆయన నాటకీయ ప్రస్థానం.. ఏఎన్నార్ ప్రతిభను గుర్తించిన దర్శకుడు గంటసాల బలరామయ్య ఆయన్ని ప్రోత్సహించాడు. మద్రాసు తీసుకెళ్లి సిల్వర్ స్క్రీన్ ఆఫర్స్ ఇచ్చారు. 1953లో దేవదాసు సినిమాతో ఆయన స్టార్ అయ్యారు. అప్పట్లోనే తెలుగు, తమిళ భాషల్లో దేవదాసు భారీ విజయం సాధించడంతో.. అక్కడి నుంచి ఆయన కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు.

1944లో సిల్వర్ స్ర్కీన్‌పై నటుడిగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన.. ఆకరి శ్వాస ‘90 ఏళ్ల వయసు’ వరకు నటించారు. చివరగా ‘మనం’ సినిమా చేశారు. కానీ, ఆ సినిమా నాగేశ్వరరావు మరణం తర్వాత విడుదల కావడం కొంచెం బాధాకరం. కీర్తితో పాటు అపార సంపద ఏఎన్నార్ ఆర్జించారు. అయితే.. అక్కినేని నాగేశ్వరరావు మొదటి సంపాదన ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. రంగస్థలంపై ఎదుగుతున్న రోజుల్లో ఓ నాటకం ఆడినందుకు అర్ధ రూపాయి అనగా.. 50 పైసలు ఇచ్చారట. అనంతరం నాటకాలు వదిలేసి సినిమాల్లోకి వెళ్లే నాటికి ఆయన సంపాదన 5 రూపాయలట. కాగా.. ఈ విషయాన్ని ఓ సందర్భంలో నాగేశ్వరరావు స్వయంగా తెలియజేశారట.

Next Story