లగ్జరీ కారు లేకుంటే ఆ ఇండస్ట్రీలో పట్టించుకోరు.. దుల్కర్ సల్మాన్ షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |

భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో అలరిస్తున్న దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.

లగ్జరీ కారు లేకుంటే ఆ ఇండస్ట్రీలో పట్టించుకోరు.. దుల్కర్ సల్మాన్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో అలరిస్తున్న దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. షూట్స్‌లో బిజీగా ఉంటున్న ఆయన పలు ఇంటర్వ్యూల్లోనూ పాల్గొంటూ ఇండస్ట్రీలో జరుగుతున్న విషయాలపై స్పందిస్తున్నారు. తాజాగా, దుల్కర్ బాలీవుడ్‌లో పనిచేసిన అనుభవాన్ని పంచుకున్నారు. అక్కడ లగ్జరీ వస్తువులతో పాటు మన చుట్టూ మనుషులు లేకుంటే పట్టించుకోరని వెల్లడించాడు. ‘‘నేను బాలీవుడ్‌లో నటించేటప్పుడు ఎప్పుడూ నా చుట్టూ ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఉండేవారు. అక్కడ నేను స్టార్ అని అందరినీ నమ్మించాల్సి వచ్చింది. అక్కడివారు మన చుట్టూ జనాలు ఉంటేనే వాళ్లు మనల్సి గుర్తిస్తారు. లగ్జరీ కారులో వెళ్తేనే స్టార్ అనుకుంటారు.

లేకపోతే నాకు కనీసం కూర్చోవడానికి కుర్చీ కూడా వేయరు. మోనిటర్ చేయడానికి స్థలం కూడా ఇవ్వరు. కానీ మలయాళ సినిమా సెట్‌లో ఇలా ఉండదు. దీనికి భిన్నంగా ఉంటుంది. చిత్రాలను తెరకెక్కించడానికి ఎక్కువ డబ్బును ఖర్చు చేయరు. బాలీవుడ్ లాగా లగ్జరీకి ప్రాధాన్యం ఇవ్వరు. అలాగే రాష్ట్రంలో ఎన్నో ప్రాంతాల్లో షూటింగ్ చేస్తాం. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే చాలా వరకు మేమే ఖర్చు పెట్టుకుంటాం’’ అని చెప్పాడు. ఇటీవల ‘కాంత’ (సినిమాతో అలరించిన దుల్కర్ త్వరలో ‘ఆకాశంలో ఒక తార’(Aakasamlo Oka Tara)తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

దీంతో పాటు నహాస్ హిదాయత్(Nahas Hidayat) దర్శకత్వంలో ‘ఐమాయ్ గేమ్’ చిత్రాన్ని చేస్తున్నారు. పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. ఈ పోస్టర్‌లో రక్తం తడిసిన చేతితో గన్ పట్టుకుని ఇంటెన్స్‌ లుక్‌లో కనిపించడం అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. ఇందులో సంయుక్త విశ్వనాథన్, మిస్కిన్, ఆంటోనీ వర్గీస్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది తెలుగు, మలయాళ, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Next Story