- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bigg Boss-7: వాళ్లను చూడలేకపోతే హౌస్ నుంచి వెళ్లిపో.. కంటెస్టెంట్‌కు వార్నింగ్ ఇచ్చిన మోహన్ లాల్ (వీడియో)
రియాలిటీ షో బిగ్‌బాస్ అన్ని భాషల్లో సక్సెస్ ఫుల్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

దిశ, సినిమా: రియాలిటీ షో బిగ్‌బాస్ అన్ని భాషల్లో సక్సెస్ ఫుల్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రేక్షకుల్లో ఎంతో ఆదరణ పొందిన ఈ షో తెలుగులో సీజన్-9 కొనసాగుతుండగా.. హిందీ సీజన్ 19, మలయాళంలో సీజన్ 7 (Bigg Boss Season 7)ప్రసారం అవుతున్నాయి. ఇక ఈ షోకు హోస్ట్‌గా మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్(Mohanlal) వ్యవహరిస్తున్నారు. ఇది ప్రారంభం అయి నెలరోజుల పైనే అవుతోంది. ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్స్ టాస్కుల్లో తమ సత్తా చూపిస్తూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా, వీకెండ్ ఎపిసోడ్‌లో మోహన్ లాల్ ఓ కంటెస్టెంట్‌పై ఫైర్ అవుతూ తన విశ్వరూపం చూపించాడు. అసలేం జరిగిందంటే.. ఇందులో లక్ష్మీ అనే కంటెస్టెంట్ లెస్బియన్ జంట అదిలా-నూరాపై దారుణమైన కామెంట్లు చేసింది. అసలు మిమ్మల్ని హౌస్‌లోకి ఎవరు రానిచ్చారు.. మీకు ఇక్కడికి వచ్చే అర్హత లేదని ఘోరంగా అవమానించింది. ఇక ఆ వీడియో చూసిన మోహన్ లాల్ వీకెండ్ ఎపిసోడ్‌లో లక్ష్మికి వార్నింగ్ ఇచ్చాడు. ‘‘అసలు బిగ్‌బాస్ హౌస్‌లోకి రావానికి అర్హత లేని వ్యక్తులు ఎవరు.
వాళ్లను నా ఇంట్లోకి ఆహ్వానిస్తాను. ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు కాస్త ఆలోచించు. అసలు వాళ్ల గురించి ఇలా మాట్లాడేందుకు నీకేం అర్హత ఉంది. వాళ్ల పక్కన ఉండలేకపోతే.. వాళ్లను చూడొద్దనుకుంటే వెంటనే హౌస్ నుంచి బయటకు వెళ్లిపో’’ అని ఫుల్ ఫైర్ అయ్యరు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇక అది చూసిన నెటిజన్లు హోస్టింగ్ అదరిపోయింది.. తప్పు చేసిన వారికి అలా గడ్డిపెట్టండి అని కామెంట్లు చేస్తున్నారు.






