'18 Pages' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి గెస్ట్‌గా వచ్చేది ఆ స్టార్ హీరోనే

by Dishanational2 |
18  Pages సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి గెస్ట్‌గా వచ్చేది ఆ స్టార్ హీరోనే
X

దిశ, వెబ్ డెస్క్: యంగ్ హీరో నిఖిల్, రింగుల జుట్టు సుందరి అనుపమ పరమేశ్వరన్ కలిసి నటించిన చిత్రం '18 పేజిస్'. పల్నాటి సూర్య ప్రతాప్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. డిసెంబర్ 23న థియేటర్స్‌లోకి రానుంది. దీనికి అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరించాడు. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్డేట్స్‌ను వదులుతున్నారు. తాజాగా, 18 పేజిస్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వస్తునట్టు నిఖిల్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. కాగా, ఈవెంట్ డిసెంబర్ 19న గ్రాండ్‌గా హైదరాబాద్ జే‌ఆర్‌సి కన్వెన్షన్ హాల్‌లో జరగనుంది. ట్విట్టర్‌లో ఓ స్పెషల్ వీడియోను కూడా షేర్ చేశాడు. ''18పేజిస్ కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రీ రిలీజ్‌లో ఇంకా రచ్చ అల్లు అర్జున్ భాయ్. మీరు కూడా గీతా ఆర్ట్స్‌ను సంప్రదించండి పాస్‌లు లభిస్తే మాతో చిల్ అవ్వొచ్చు.. ధన్యవాదాలు'' అంటూ రాసుకొచ్చాడు. దీంతో అది చూసిన నెటిజన్లు 'తగ్గేదెలా అన్నా' అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Also Read...

Besharam Rang సాంగ్ @6 కోట్ల వ్యూస్

Next Story

Most Viewed