- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఖైదీ-2’ కోసం 35 పేజీల కథ రాశాను.. చాలా ఆసక్తికరంగా ఉండబోతుందంటూ హైప్ పెంచేసిన లోకేష్
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) భారీ ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీ బిజీ లైఫ్‌ను లీడ్ చేస్తున్నారు.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) భారీ ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీ బిజీ లైఫ్‌ను లీడ్ చేస్తున్నారు. ప్రస్తుతం రజినీకాంత్ హీరోగా.. లోకేష్ తెరకెక్కించిన చిత్రం ‘కూలీ’(coolie). పలువురు స్టార్ నటించిన ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా.. భారీ అంచనాల మధ్య ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో పాటు లోకేష్, కార్తీ(Karthi)తో ‘ఖైదీ-2’ (Kaithi-2) కూడా చేస్తున్నారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ ‘ఖైధీ’కి సీక్వెల్‌గా తెరకెక్కుతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లోకేష్ కనగరాజ్ ‘ఖైదీ-2’ షూటింగ్ అప్డేట్ ఇస్తూ అంచనాలను పెంచేశారు. ‘‘కూలీ సినిమా విడుదలైన వెంటనే ‘ఖైధీ-2’ షూటింగ్ ప్రారంభిస్తాము.
లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ఎల్‌సీయూలోని ఒక భాగం. ఇప్పటికే దీనికి సంబంధించి 35 పేజీల స్టోరీ రాసుకున్నాను. అది కూడా చాలా బాగా వచ్చింది. చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. Kaithi2 - మొదటి ఆలోచన ఢిల్లీ జీవితాన్ని అతని 10 సంవత్సరాల జైలు జీవితానికి ముందు చూపించబోతున్నాను. కానీ LCU తర్వాత, విక్రమ్, లియో పాత్రలతో ఇది ఆసక్తికరమైన ఆలోచనగా అభివృద్ధి చెందింది’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ విషయం తెలుసుకున్న ప్రేక్షకులు ఈ మూవీ ఎప్పుడెప్పుడు రాబోతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.






