ఆ హీరో కోసం ఇంట్లో నుంచి అయినా వెళ్లిపోతా.. బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-12-23 15:57:33  IST  )

బిగ్‌బాస్ షో అప్పుడే 11వ వారంలోకి అడుగుపెట్టనుంది. అలాగే మరో నాలుగు వారాల్లో బిగ్‌బాస్ సీజన్ 9వ సీజన్ కూడా గ్రాండ్ ఫినాలేకి కూడా చేరుకోబోతుంది.

ఆ హీరో కోసం ఇంట్లో నుంచి అయినా వెళ్లిపోతా.. బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: బిగ్‌బాస్ షో అప్పుడే 11వ వారలోకి అడుగుపెట్టనుంది. అలాగే మరో నాలుగు వారాల్లో బిగ్‌బాస్ సీజన్ 9వ సీజన్ కూడా గ్రాండ్ ఫినాలేకి కూడా చేరుకోబోతుంది. ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్‌‌లో భాగంగా నిఖిల్ ఇంటి నుంచి బయటకు రాగా.. మరికొద్ది గంటల్లో మరో కంటెస్టెంట్ గౌరవ్ కూడా ఎలిమినేట్ అవ్వనున్నట్లు సమాచారం. తాజాగా, ఓ ప్రోమో విడుదలైంది. ఇందులో నాగచైతన్య(Naga Chaitanya) గెస్ట్‌గా వచ్చారు. ‘‘నాకు యాక్టింగ్‌తో పాటు రేసింగ్ అంటే బాగా ఇష్టమని మీకు తెలుసు. నాలుగేళ్ల క్రితం ఇండియన్ రేసింగ్ లీగ్ అని ఓ ఫెస్టివల్ స్టార్ట్ అయ్యింది. అందులో హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ టీమ్‌కి నేనే ఓనర్‌ను అని అనగా.. నాకు తెలియకుండా ఎప్పుడు చేశావని నాగార్జున అడగ్గా.. చేశానులే అని ఆన్సర్ ఇచ్చాడు.

ఆ తర్వాత హౌస్‌మెట్స్ అందరికీ పరిచయం చేశారు. దీంతో చైతుని చూడగానే.. మీరంటే పిచ్చి అని రీతూ చెప్పింది. ఆ తర్వాత నాగ్ నేనంటే ఇష్టమని అన్నావుగా అని నాగార్జున చెప్పగా.. ఎప్పటికీ మీరు మీరే సార్ అని రీతూ (Ritu Chowdhury)తెలిపింది. చైతూలో నీకు బాగా నచ్చిన విషయం ఏంటో చెప్పమని నాగ్ అడగ్గా... చైతూ సార్ కాళ్లు ఉంటాయి సార్, ఎంత తెల్లగా ఉంటాయో, శిల్పాన్ని చెక్కినట్లుగా ఉంటారు అంటుంది. ఆ శిల్పాన్ని చెక్కింది నేనే అని నాగ్ అనడంతో అంతా నవ్వేస్తారు. కార్తీక్ అనే పేరుంది కదా సార్.. నా బాయ్ ఫ్రెండ్ పేరు కార్తీక్ ఉండాలని కొన్ని రోజులు వెతికాను అని రీతూ చెప్పింది.

అయితే మీ పేరు జెస్సీ కాదు కదా అని చైతూ సెటైర్ వేయడంతో అంతా నవ్వేస్తారు. ఆ తర్వాత నాగ్.. నిన్ను బైక్‌ మీద తీసుకుని వెళ్తాడని రీతూకి బంపర్ ఆఫర్ ఇస్తాడు. వెంటనే ఆమె ఆలోచించకుండా.. ఐయామ్ కమింగ్.. ఆయన కోసం ఎలిమినేట్ అయి ఇంట్లోంచి వచ్చేయడానికి ఓకే అని చేప్పేసింది. దీంతో షాక్ అయిన చైతు.. నువ్వు గెలిచినా కూడా తర్వాత నిన్ను నేను బైక్ మీద తీసుకెళ్తా అని అంటాడు. వీరిద్దరి మధ్య సంభాషణ చాలా ఫన్నీగా జరిగినప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

Next Story