‘‘ఎవరికీ క్షమాపణలు చెప్పను నా జోలికి రాకండి పగిలిపోద్ది’’.. అటిట్యూడ్ స్టార్ షాకింగ్ స్టేట్‌మెంట్

by Mallepaka Hamsa |

చంద్రహాస్ (Chandrahas)తన మొదటి సినిమా నుంచే ‘అటిట్యూడ్ స్టార్’గా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు వివాదాల్లో చిక్కుకుంటున్నాడు.

‘‘ఎవరికీ క్షమాపణలు చెప్పను నా జోలికి రాకండి పగిలిపోద్ది’’.. అటిట్యూడ్ స్టార్ షాకింగ్ స్టేట్‌మెంట్
X

దిశ, సినిమా: చంద్రహాస్ (Chandrahas)తన మొదటి సినిమా నుంచే ‘అటిట్యూడ్ స్టార్’గా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. తాజాగా, చంద్రహాస్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఫిబ్రవరి 6న విడుదల కాబోతున్న ‘బరాబర్ ప్రేమిస్తా’ (Barabar Premistha)సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో ఆయన ప్రవర్తన తీవ్ర విమర్శలకు దారితీసింది. మహిళలు, సినీ ప్రముఖులు ఉన్న వేదికపై అసభ్యకర బూతు పదాలు ఉన్న పాటను పాడి అందరినీ షాక్‌కు గురిచేశాడు. ఈ వీడియో నెటిజన్లు దారుణంగా కామెంట్లు పెడుతున్నారు. ఇక దీనిపై నెటిజన్లు మండిపడుతుంటే, చంద్రహాస్ మాత్రం తన చర్యను సమర్థించుకుంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనపై వస్తున్న విమర్శలపై చంద్రహాస్ స్పందిస్తూ ఒక వీడియో విడుదల చేశాడు.

"వందల సార్లు నన్ను బూతులు తిడుతూ ట్రోల్ చేసినప్పుడు నా మనోభావాలు దెబ్బతినలేదా? నన్ను అన్న మాటల్నే నేను పాటగా పాడితే తప్పా? నేను ఎవరికీ సారీ చెప్పను" అని కుండబద్దలు కొట్టాడు. తన జోలికి వస్తే పగిలిపోద్ది అంటూ ఘాటుగా హెచ్చరించడం అభిమానుల్లో, సామాన్య ప్రేక్షకుల్లో ఆగ్రహాన్ని కలిగిస్తోంది. సినిమా ప్రమోషన్ల కోసం ఇంతలా దిగజారాలా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ వివాదంలో చంద్రహాస్ ఒక అడుగు ముందుకేసి అశోక్ కుమార్ వేముల అనే వ్యక్తికి ఓపెన్ వార్నింగ్ ఇచ్చాడు. తనను నీచంగా దూషించినందుకు గాను ఆయన 24 గంటల్లోగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు. లేనిపక్షంలో ఈ విషయాన్ని రచ్చ రచ్చ చేస్తానని హెచ్చరించాడు.

ఇప్పటివరకు నేను ఎవరిపై రియాక్ట్ కాలేదు.బాధను చెప్పలేదు. ఎందుకంటే.. ఎవరి ఏమన్నా.. కానీ సరదాగా విని సరదాగా వదిలేశాను. అశోక్ అందరినీ నీచంగా అన్నాడు. ఇది కరెక్ట్ కాదు. ఆ పాట పాడినందుకు బాధపడటం లేదు. నేను ఎవరికీ సారి చెప్పను. ఈ పాటకు పనిచేసిన వాళ్లు చిన్నాచితకా వాళ్లు కాదు. మూడున్నర నిమిషాల పాటలో 5 సెకండ్లు కట్ చేసి బూతు పురాణం అంటున్నారు. ఎన్ని సినిమాల్లో బీప్ సౌండ్ వాడరు? అని ప్రశించాడు. మరోవైపు, ఇదే వేదికపై ఉన్న నటుడు జేడీ చక్రవర్తి కూడా చంద్రహాస్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఆ పాట విన్నప్పుడు తాను షాక్‌కు గురయ్యానని, ఇలాంటి చెత్త ప్రమోషన్లతో సినిమాలు ఆడుతాయనుకోవడం భ్రమ అని జేడీ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.

Next Story