- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సినిమాలు మానేసి క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తాను.. పుష్ప విలన్ షాకింగ్ కామెంట్స్
మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్(Fahad Fazil) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వివిధ భాషల్లో నటించిన ఆయన ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నారు.

దిశ, సినిమా: మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్(Fahad Fazil) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వివిధ భాషల్లో నటించిన ఆయన ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నారు. హీరోగా, నిర్మాతగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వర్క్ చేస్తూ ఫుల్ బిజీ బిజీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇక తెలుగులో పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’లో విలన్ పాత్రలో నటించి విపరీతమైన క్రేజ్‌ను దక్కించుకున్నారు. ఇక ఇటీవల ఫహాద్ ‘మారీశన్’ (Marrison)కామెడీ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘నాకు చాలా ఇష్టమైన ప్రదేశం బార్సీలోనా. నన్ను బిగ్ స్క్రీన్‌పై ఒక చాల్లే చూడలేకపోతున్నాం అని ప్రేక్షకులు అనుకున్న రోజు అక్కడికి వెళ్లి స్థిరపడతాను.
ప్రజలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకువెళ్తా. జనాలను గమ్యస్థానాలను తీసుకువెళ్లడం కంటే మంచి విషయం ఏముంటుంది. అది నా దృష్టిలో చాలా గొప్ప పనిగా భావిస్తాను. డ్రైవింగ్ అంటే నాకు చాలా ఇష్టం. అది నాకు ఎప్పుడూ బోర్ కోట్టదు. కాబట్టి రిటైర్ అయిన తర్వాత స్పెయిన్‌లోని బార్సీలోనాకు వెళ్లి ఐబర్ డ్రైవర్‌గా వర్క్ చేస్తాను. అక్కడి ప్రాంతాలన్నింటినీ చుట్టేస్తూ ప్రజలను తిప్పుతుంటాను. ఈ విషయం నా భార్య నజ్రియాకు కూడా చెప్తాను. ఆమె దానికి అంగీకరించింది. నాతో పాటు ఉండటానికి’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు షాక్ అవుతున్నారు.






