- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్యారెక్టర్‌ను కించపరిస్తే ఊరుకునేది లేదంటూ రేణు దేశాయ్ స్ట్రాంగ్ వార్నింగ్.. వీడియో వైరల్
చివరికి నేను ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాను అనే విషయాల్లో కూడా దేన్నీ వదలకుండా ప్రతి డిపార్ట్‌మెంట్‌ను కవర్ చేశారు.

దిశ, సినిమా: సోషల్ మీడియాలో తనపై వస్తున్న వరుస ట్రోల్స్, నెగెటివ్ కామెంట్స్ మీద నటి రేణు దేశాయ్ (Renu Desai)ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితం గురించి కొందరు పనికట్టుకుని చేస్తున్న విమర్శలపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వరుస వీడియోలు పెట్టారు. ‘‘2012లో నేను విడాకులు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు నా పర్సనల్ లైఫ్ గురించి ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. నా డివోర్స్ ఇష్యూ, నేను ఎంత భరణం తీసుకున్నాను. చివరికి నేను ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాను అనే విషయాల్లో కూడా దేన్నీ వదలకుండా ప్రతి డిపార్ట్‌మెంట్‌ను కవర్ చేశారు. నా గురించి వినడానికి ఇంకా ఏమీ మిగిల్లేదని నేను అనుకున్నాను. కానీ ప్రతి విషయంలోనూ నన్ను టార్గెట్ చేయడం ఆపలేదు’’ అంటూ ఆమె తన ఆవేదనను పంచుకున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది జనవరిలో వీధి కుక్కల సంరక్షణ గురించి తాను మాట్లాడిన మాటలను కొందరు తప్పుగా చిత్రీకరించడంపై ఆమె స్పష్టతనిచ్చారు. వందల సంఖ్యలో కుక్కలను దారుణంగా చంపేస్తుంటే తట్టుకోలేక, కొన్ని ఎన్జీవోల బృందం కోరడంతో తాను ఆ ప్రెస్ మీట్‌కు వెళ్లాల్సి వచ్చిందని రేణు తెలిపారు.
నిజానికి అక్కడికి వెళ్తే మళ్ళీ అనవసరంగా తిట్లు పడతాయని తెలిసి తాను మొదట నిరాకరించినా, పరిస్థితి తీవ్రతను చూసి వెళ్లక తప్పలేదని అన్నారు. ‘‘వంద కుక్కల్లో ఒక పది పిచ్చివి ఉండవచ్చు, వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. కానీ ఆ పదింటి కోసం మిగిలిన తొంభై మంచి కుక్కలను చంపడం ఎంతవరకు కరెక్ట్? అందులో నేనేమైనా తప్పుగా అన్నానా? మనుషులు తప్పు చేసినా, కుక్కలు చేసినా తప్పే అని నేను క్లియర్ గా చెప్పాను’’ అని ఆమె ప్రశ్నించారు. తాను చెప్పిన అసలు విషయాన్ని అర్థం చేసుకోకుండా కొన్ని స్టుపిడ్ యూట్యూబ్ ఛానళ్లు, పనికమాలిన ఇన్స్టాగ్రామ్ పేజీలు తనపై బూతులు తిడుతూ పోస్టులు పెట్టడంపై రేణు దేశాయ్ మండిపడ్డారు. ఉన్నవీ లేనివీ కల్పించి తన క్యారెక్టర్‌ను కించపరిచేలా ప్రవర్తిస్తున్న వారి తీరును ఆమె అసహ్యం వ్యక్తం చేస్తూ ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.






