నాకు ప్రత్యేక గుర్తింపు దక్కని సినిమాల్లో నటించను.. మాళ‌విక షాకింగ్ కామెంట్స్

by Disha Web Desk 7 |
నాకు ప్రత్యేక గుర్తింపు దక్కని సినిమాల్లో నటించను.. మాళ‌విక షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్ ఇకపై తాను నటించబోయే సినిమాల ఎంపిక గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అరంగేట్రం నుంచి వినూత్న పాత్రల‌ను ఎంచుకుంటూ ప్రేక్షకుల‌ను ఆక‌ట్టుకుంటున్న నటి.. అందాల ఆర‌బోత‌తోనూ విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకుంది.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాళవిక మాట్లాడుతూ.. ‘నేను చేయ‌బోయే ఏ రోల్‌కైనా ఇంపార్టెన్స్ లేకపోతే.. అలాంటి చిత్రాల్లో న‌టించ‌ను. రూ.500 కోట్లు వసూలు చేసే భారీ బడ్జెట్ చిత్రంలో కూడా నా పాత్రకు ప్రాధాన్యత లేకపోతే నిర్మోహమాటంగా నో చెప్పేస్తా. నాకు, నా క్యారెక్టర్‌కు ఇంపార్టెన్స్ లేని సినిమాలో చేసి అది సూపర్ హిట్ అయినా అలాంటి సినిమాల వ‌ల్ల వ్యక్తిగతంగా నాకు గుర్తింపు దక్కదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా’ అంటూ తన మనసులో మాట బయటపెట్టింది. ప్రస్తుతం మాళ‌విక చేసిన కామెంట్స్ ఇండస్ట్రీల్లో చర్చనీయాంశమయ్యాయి.

Next Story

Most Viewed