బండ్ల గణేష్ చేసింది ఎప్పటికీ మర్చిపోను.. చాలా బాధేసిందంటూ బన్నీ వాస్ ఆసక్తికర కామెంట్స్

by Mallepaka Hamsa |

బండ్ల గణేష్(Bandla Ganesh) సినిమాలు తెరకెక్కించనప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నాడు.

బండ్ల గణేష్ చేసింది ఎప్పటికీ మర్చిపోను.. చాలా బాధేసిందంటూ బన్నీ వాస్ ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: బండ్ల గణేష్(Bandla Ganesh) సినిమాలు తెరకెక్కించనప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నాడు. నిత్యం పలు వివాదాస్పద పోస్టులు షేర్ చేస్తూ.. వార్తల్లో నిలుస్తున్నాడు. ఇక ఇటీవల ఆయన చాలా రోజుల తర్వాత ‘లిటిల్ హార్ట్స్’ సక్సెస్ మీట్‌కి వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇందులో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘‘మౌళి(mouli) నువ్వేమి నమ్మకు. నీ సినిమా హిట్ అయింది కాబట్టి ఇంతమంది వచ్చి ఇన్ని మాట్లాడుతున్నారు. కేవలం నీ సక్సెస్ వల్ల వీళ్ళందరూ వచ్చారు. దీనిని నువ్వు దృష్టిలో పెట్టుకోకు.. 20 రోజులు జరిగింది అంతా ఓ మాయ. ఇండస్ట్రీలో కష్టపడితేనే నిలబడగలం. కోటి మందికి ఒకటి మాత్రమే మెగాస్టార్‌కు బావమరిదిగా, అల్లు రామలింగయ్య వంటి వాళ్లకు కొడుకుగా పుడతాను.

వాళ్లు ఏమి చేయక్కర్లేదు. మనమంతా కష్టపడితే చివర్లో వచ్చి కూర్చొని క్రెడిట్ మొత్తం తీసుకుంటారు. అలా జరగడం కారణజ్ములకు మాత్రమే’’ అని చెప్పుకొచ్చారు. తాజాగా, ఈ విషయంపై బన్నీ వాసు స్పందించారు. ‘‘ఇది మా సంతోషకరమైన క్షణం. కానీ బండ్ల గణేష్ మాటలతో నేను నిజంగా బాధపడ్డాను. వాటిని ఎప్పటికీ మర్చిపోను. ఆ క్షణం నేను వేదికపైకి వెళ్లి స్పందించాలనుకున్నాను. కానీ నేను దానిని పెద్ద సమస్యగా మార్చాలనుకోలేదు. అందుకే సైలెంట్‌గా ఊరుకున్నాను. కానీ నేను ఆ తర్వాత చాలా బాధపడ్డాను’’ అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ విషయంపై నెటిజన్లు అయితే, అతను చెప్పిన దానిలో తప్పేంటి? అతను నిజాలు మాట్లాడాడు కదా అని అంటున్నారు.

Next Story