ఆ రోజులను నా జీవితంలో మర్చిపోలేను.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన రకుల్

by Mallepaka Hamsa |   (  Updated:2025-11-30 06:54:51  IST  )

సినిమా షూటింగ్‌ల్లో ప్రమాదాలు జరగడం కొత్త విషయం కాదు. చిన్న యాక్షన్ సీన్ల నుంచి భారీ స్టంట్‌ల వరకూ, నటీనటులు ఎన్నో రకాల రిస్కులు తీసుకోవాల్సి వస్తుంది.

ఆ రోజులను నా జీవితంలో మర్చిపోలేను.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన రకుల్
X

దిశ, సినిమా: సినిమా షూటింగ్‌ల్లో ప్రమాదాలు జరగడం కొత్త విషయం కాదు. చిన్న యాక్షన్ సీన్ల నుంచి భారీ స్టంట్‌ల వరకూ, నటీనటులు ఎన్నో రకాల రిస్కులు తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఇటీవల ఇలాంటి ప్రమాదాలు మరింత ఎక్కువయ్యాయని ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆందోళన వ్యక్తం అవుతోంది. నిజంగా ప్రాణాలకు ముప్పు వాటిల్లే సంఘటనలు చోటు చేసుకుంటుండటంతో, భద్రతపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పలువురు చెబుతున్నారు.ఇక ఇటీవల ‘కాంతార: చాప్టర్ 1’ షూటింగ్ సమయంలో జరిగిన ఘోర ప్రమాదం దీనికి ఉదాహరణగా నిలిచింది. షూటింగ్ ప్రక్రియలో పాల్గొన్న ఒక వ్యక్తి దురదృష్టకరంగా ప్రాణాలు కోల్పోవడంతో ఆ సినిమా యూనిట్ తీవ్రంగా షాక్‌కు గురైంది. వెంటనే షూట్‌ని వాయిదా వేసి, భద్రతా చర్యలపై పునర్విమర్శ చేపట్టడం జరిగింది.

ఈ సంఘటన సినీ పరిశ్రమలో సేఫ్టీ స్టాండర్డ్స్‌పై చర్చలను మరింత వేడెక్కించింది. ఇలాంటి సమయంలోనే మరో సంఘటన చోటుచేసుకుంది. రకుల్ ప్రీత్ సింగ్‌(Rakul Preet Singh) షూటింగ్‌లో పాల్గొన్నప్పుడు ఆమె తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. వైద్యులు ఆమెకు ఆరు నెలలు పూర్తిగా విశ్రాంతి అవసరమని చెప్పినా, సినిమా యూనిట్‌ను దృష్టిలో పెట్టుకుని వెంటనే షూటింగ్‌కి హాజరైనట్లు ఆమె చెప్పింది. తన ఆరోగ్యాన్ని పక్కన పెట్టి టీమ్ కోసం రిస్క్ తీసుకున్న విషయాన్ని వెల్లడిస్తూ రకుల్ భావోద్వేగానికి గురైంది. ‘‘దేదే ప్యార్ దే-2’ (De De Pyaar De-2)షూట్ మధ్యలో నాకు ప్రమాదం జరిగి తీవ్రంగా గాయపడ్డాను. నడుము, కండరాలు దాదాపు దెబ్బితినగా నడవడమే కష్టంగా మారింది నా పరిస్థితి. కొన్ని సందర్బాల్లో కాళ్లకు కరెంట్ షాక్ వచ్చినట్లు కూడా నొప్పి వచ్చింది.

అలాంటి పరిస్థితుల్లో కూడా నేను షూటింగ్‌కు హారయ్యాను. యాక్షన్ సీన్లు, గ్యాన్స్ అన్నీ చేశాను. అన్ని పెయిన్ కిల్లర్స్ వాడుతూ, చికిత్స తీసుకుంటూనే షూట్ పూర్తి చేశా. ఏ క్షణంలో ఏమవుతుందో అని ఎమ్ఆర్ఐ రిపోర్ట్‌ను సెట్‌కి తీసుకెళ్లేదాన్ని. ఏదైనా అత్యవసరం అయితే డాక్టర్లకు చూపించొచ్చు అని. ఒక్కసారి షాట్ ఒకే అయితే నెలపై పడిపోయేదాన్ని గాయమైన సమయంలో డాక్టర్లు ఆరు నెలల రెస్ట్ తీసుకోమని చెప్పినా రెండు నెలల్లోనే షూట్‌కి వెళ్లాను. ఆ రోజులను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ప్రస్తుతానికి పూర్తిగా కోలుకున్నాను’’ అని చెప్పింది. ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు కొందరు షాక్ అవుతుండగా.. మరికొందరు గ్రేట్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా ఇటీవల అజయ్ దేవ్‌గణ్, రకుల్ కాంబోలో వచ్చిన ‘దేదే ప్యాదే-2’ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. రకుల్ కష్టానికి ప్రతిఫలితం దక్కినట్లు అయింది.

Next Story