ఇంటిమేట్ సీన్స్ ఒకే.. కానీ లిప్ లాక్ మాత్రం ఆ ఒక్కడికే ఇస్తా.. యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే పాపులారిటీ పెంచుకునే వారిలో కుషిత కల్లపు Kushitha Kallapu)కూడా ఒకరు.

ఇంటిమేట్ సీన్స్ ఒకే.. కానీ లిప్ లాక్ మాత్రం ఆ ఒక్కడికే ఇస్తా.. యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే పాపులారిటీ పెంచుకునే వారిలో కుషిత కల్లపు Kushitha Kallapu)కూడా ఒకరు.2023లో 'నీతోనే నేను' అనే సినిమాతో సినిరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తెలుగులో చంగురే బంగారు రాజా, మనోహరం వంటి సినిమాల్లో నటించింది. 2024లో బాబు (No.1 బుల్‌షిట్ గై) అనే మూవీలో కనిపించింది. ఇక ఇటీవల ‘చిరంజీవ’లో నటించిన ప్రేక్షకులను మెప్పించింది. త్వరలో ‘3 రోజేస్’ (3roses)అనే వెబ్‌సిరీస్‌తో రాబోతుంది. ఈ సిరీస్ ను డైరెక్టర్ మారుతి క్రియేటర్ గా వ్యహరించగా.. SKN నిర్మించారు. మాగీ దర్శకత్వం వహించారు. మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్ కాబోతుంది.

ఈ నేపథ్యంలో.. తాజాగా, కుషిత కల్లాపు ప్రమోషన్స్‌లో భాగంగా షాకింగ్ కామెంట్స్ చేసింది. బోల్డ్ సీన్స్ చేయడానికి రెడీగా అని యాంకర్ ప్రశ్నించగా.. ‘‘ఇంటిమేట్ సీన్స్ అయితే ఓకే కానీ లిప్ టూ లిప్ కిస్ సీన్స్ మాత్రం చేయను. లిక్ లాక్ సీన్స్ చేయడానికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోరు. అలా అని కాదు కానీ నాకూడా అలా చేయడం ఇష్టం లేదు. యానిమల్ లో తృప్తి దిమ్రి చేసిన పాత్రకు ఎంత పేరొచ్చినా..నేను మాత్రం అటువంటి క్యారెక్టర్స్ చేయను. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. నా మొదటి ముద్దు అయినా హగ్ అయినా నా భర్తకు మాత్రమే ఇస్తాను.

ఈ విషయంలో రాజీ పడేది లేదు. సినిమా అవకాశాల కోసం ఎలా పడితే అలా నటించాలనే ఆలోచన నాకు లేదు’’ అని చెప్పింది. మరి కుషిత తన మాటకే కట్టుబడి ఉందా? '3 రోజెస్' కోసం రూల్స్ బ్రేక్ చేసిందా? అనేది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. ఇక కుషిత కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇలా అన్న వారిని ఎంతోమందిని చూశామని.. ఇలాంటివి చెప్పిన వారే బోల్డ్ సీన్స్‌లో రెచ్చిపోతారని ట్రోల్ చేస్తున్నారు.

Next Story