కచ్చితంగా ఆ మూవీ సీక్వెల్‌లో నటిస్తా..ఆయన పిలుపు కోసం ఎదురు చూస్తున్నా: హర్షల్ మల్హోత్రా

by Mallepaka Hamsa |

హర్షల్ మల్హోత్రా(Harshal Malhotra) ‘బజరంగి భాయిజాన్’ (Bajrangi Bhaijaan)సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

కచ్చితంగా ఆ మూవీ సీక్వెల్‌లో నటిస్తా..ఆయన పిలుపు కోసం ఎదురు చూస్తున్నా: హర్షల్ మల్హోత్రా
X

దిశ, సినిమా: హర్షల్ మల్హోత్రా(Harshal Malhotra) ‘బజరంగి భాయిజాన్’ (Bajrangi Bhaijaan)సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. సల్మాన్ ఖాన్, కబీర్ ఖాన్(Kabir Khan) కాంబోలో వచ్చిన ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించింది. అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీసును షేక్ చేసింది. ఈ చిత్రానికి సీక్వెల్ కూడా రాబోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. తాజాగా, హర్షల్ మల్హోత్రా ఇంటర్వ్యూలో పాల్గొని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది ‘‘బజరంగీ భాయిజాన్-2 గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి.

అన్ని ఫ్రాంచైజీలు బాగా రాణిస్తున్న ఈ రోజుల్లో, గత రెండు దశాబ్దాలలో అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రానికి కబీర్ సర్ సీక్వెల్ తీయాలనుకుంటున్నారు. మేము ఈ సినిమా విషయంలో జాగ్రత్తగా ఉన్నాము. బజరంగీ భాయిజాన్ లాంటి ఉత్తేజకరమైన కథను ప్రేక్షకులకు అందించడానికి సల్మాన్, నేను సిద్ధంగా ఉన్నాము. కబీర్ సర్ పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. వారు నన్ను ఈ చిత్రానికి పిలిస్తే, నేను ఖచ్చితంగా సీక్వెల్‌లో నటించడానికి వెళ్తాను. ఇప్పటికీ జనాలు నా దగ్గరకు వచ్చి లాస్ట్ సీన్‌ చూసి ఏడ్చామని చెప్పినప్పుడు నాకు బాధగా అనిపిస్తుంది. ఆ సినిమా విడుదలైనప్పటి నుండి ఆ సీన్ నేను చాలాసార్లు చూశాను.

కొన్నిసార్లు చిన్నప్పుడు నేను ఈ సన్నివేశాలను ఎలా చేశాను? అని ఆలోచిస్తాను. ఇప్పుడు మళ్ళీ నటిస్తున్నాను కాబట్టి నేను మళ్ళీ ఇవన్నీ చేయగలనని నాకు నమ్మకంగా ఉంది. నా లక్ష్యాలను సాధించడానికి నేను కష్టపడి పనిచేస్తానని నమ్ముతున్నాను. నాకు నటన అంటే చాలా ఇష్టం అది నా అభిరుచి. ప్రస్తుతం నేను ‘అఖండ 2’లో నటిస్తున్నాను. ‘బజరంగ్ బాయ్‌జాన్’లో నన్ను ఎలా ప్రేమించారో అదే విధంగా భవిష్యత్తులో కూడా అదే విధంగా ప్రేమిస్తారని నేను ఆశిస్తున్నాను’’ అని చెప్పుకొచ్చింది. ఈ అమ్మడు త్వరలో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది. మొట్టమొదటి సినిమానే బాలయ్య అఖండ-2 లో అవకాశం అందుకుంది.బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ‘అఖండ’కు సీక్వెల్‌గా రాబోతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం సెప్టెంబర్‌లో థియేటర్స్‌లోకి రాబోతుంది.

Next Story