ఆ మూవీలో పూర్తిగా మేకప్ లేకుండా నటించా.. నా పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుంది: శ్రియా రెడ్డి

by Mallepaka Hamsa |

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) సుజిత్ దర్శకత్వంలో వస్తున్న 'ఓజీ' (og)సినిమా దసరా కానుకగా సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

ఆ మూవీలో పూర్తిగా మేకప్ లేకుండా నటించా.. నా పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుంది: శ్రియా రెడ్డి
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) సుజిత్ దర్శకత్వంలో వస్తున్న 'ఓజీ' (og)సినిమా దసరా కానుకగా సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi)ప్రతినాయకుడిగా కనిపించారు. పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించింది. ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, హరీష్ ఉత్తమన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రియా రెడ్డి ‘ఓజీ’ చిత్రంపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘నా పాత్రలో భావోద్వేగాలతో పాటు శక్తి కలిసి చాలా పవర్ ఫుల్‌గా ఉంటుంది.

ముఖ్యంగా ఈ సినిమాలో నేను మేకప్ వేసుకోకుండా నటించాను. రియలిస్టిక్‌గా కనిపించాలని కోరుకోవడంతో నేను కూడా అంగీకరించాను. పవన్ కళ్యాణ్ గారు షూటింగ్‌లో ఎక్కువగా మాట్లాడరు. రాజకీయ పనులు పక్కనపెట్టి వస్తారు కాబట్టి నేను కూడా ఆయనతో మాట్లాడాలని ఇబ్బంది పెట్టకుండా నా పని నేను చేసుకున్నాను. సెట్‌లో మేము సినిమాకి సంబంధించిన విషయాలు మాత్రమే చర్చించుకున్నాం. పవర్ స్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం మంచి అనుభవం చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా ‘ఓజీ’ చిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అందరిలో ఆమె పాత్రపై క్యూరియాసిటీ పెరిగిపోయింది.

Next Story