- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
12 రోజులు నరకం చూశా.. కుటుంబంతో పారిపోదామనుకున్నానంటూ టాలీవుడ్ హీరో ఎమోషనల్ కామెంట్స్
టాలీవుడ్ నటుడు నందు(Nandu) ‘సైక్ సిద్ధార్థ’ (Sai Siddharth)సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

దిశ, సినిమా: టాలీవుడ్ నటుడు నందు(Nandu) ‘సైక్ సిద్ధార్థ’ (Sai Siddharth)సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇది కామెడీ, రొమాన్స్, సోషల్ సాటిర్ అంశాలతో కూడిన డార్క్ కామెడీ డ్రామాగా రాబోతుండగా..యామిని భాస్కర్ (Yamini Bhaskar)హీరోయిన్‌గా నటిస్తోంది. వరుణ్ రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 1న విడుదల కాబోతుంది. అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన నందు తన పర్సనల్ విషయాలు తెలుపుతూ ఎమోషనల్ అయ్యాడు. తనపై తప్పుడు వార్తలు వచ్చినప్పుడు ఇతర దేశానికి పారిపోవాలనుకున్నట్లు షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘‘నేను ఈ ఫీల్డ్‌లో లేకపోతే నా అలాంటి పుకార్లు వచ్చేవి కాదు.
మనకు బ్యాక్‌గ్రౌండ్ లేకుంటే మనం ఏం చేయలేమని సంబంధం లేని అంశాల్లో మన పేర్తు చేరుస్తారు. నేను చేయని పనికి నా మీద ఆరోపణలు వచ్చాయి. దీంతో చాలామంది నానారకాలుగా మాట్లాడుకున్నారు. నిజాలు తెలుసుకోకుండా.. జరిగిందేంటి అనేది ఆలోచించకుండా నా గురించి తప్పుగా అనుకున్నారు. ఆ సమయంలో నాతో పాటు నా కుటుంబం చాలా బాధపడింది. అప్పుడు నా భార్య గీతా మాధురి ఇక్కడ ఉండలేకపోతున్నాం. అన్ని వదిలేసి వేరే దేశానికి వెళ్లి హోటల్లో పని చేసుకుందామని చెప్పింది. ఆ మాటలు గుర్తు చేసుకుంటూ ఇప్పటికీ కన్నీళ్లు వస్తాయి’’ అని చెప్పుకొచ్చాడు.






