ఆ స్టార్ హీరో కోసం కథ రాస్తుంటే చాలా భయపడ్డా: వశిష్ట

by Mallepaka Hamsa |

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), వశిష్ట కాంబినేషన్‌లో రాబోతున్న పాన్ ఇండియా చిత్రం ‘విశ్వంభర’(Vishvambhara).

ఆ స్టార్ హీరో కోసం కథ రాస్తుంటే చాలా భయపడ్డా: వశిష్ట
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), వశిష్ట కాంబినేషన్‌లో రాబోతున్న పాన్ ఇండియా చిత్రం ‘విశ్వంభర’(Vishvambhara). ఇందులో త్రిష(Trisha) హీరోయిన్‌గా నటిస్తుండగా.. అషికా రంగనాథ్ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ మూవీలో మౌనిరాయ్ (Mouni Roy)స్పెషల్ సాంగ్ చేయనుంది. సోషియో-ఫాంటసీ చిత్రంగా తెరకెక్కుతుండగా.. దీనిని యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్న ఈ సినిమా నుంచి అప్డేట్ ఇచ్చాడు ద‌ర్శకుడు వశిష్ట. ఈ మూవీ చివ‌రి షెడ్యూల్ షూటింగ్ తాజాగా స్టార్ట్ అయిన‌ట్లు మెగాస్టార్ చిరంజీవి సెట్స్‌లో జాయిన్ అయిన‌ట్లు ఇటీవల ప్రకటించాడు.

ఈ క్రమంలో.. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘నా సినిమా 157వ ప్రాజెక్ట్. చిరంజీవి కోసం స్టోరీ రాసేటప్పుడు చాలా భయపడ్డాను. కానీ ఆయన అలా ఉండాలి.. ఇలా ఉండాలని ఏరోజు చెప్పకుండా చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. నీకు ఇది కరెక్ట్ అనిపిస్తే అది చేయి అని చెప్పారు. కథలో నేనుండాలి కానీ కథ నా చుట్టూ తిరగకూడదు. చిరంజీవి గారు మనం చెప్పేది వింటారు. షాట్‌లో ఆయన కటింగ్ ఇచ్చి మనం రాసింది అంతా ఆయన అకౌంట్‌లోకి వేసుకుని దాని రేంజ్‌ను మారుస్తారు. చిరు నాకు అవకాశం ఇచ్చారు.. దాన్ని నేను నిలబెట్టుకుంటాను’’ అని చెప్పుకొచ్చారు.

Next Story