- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ సమయంలో చాలా భయపడ్డాను.. గదిలోంచి బయటకు రాలేదు.. కళ్యాణి ప్రియదర్శన్ షాకింగ్ కామెంట్స్
మలయాళ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan)ఇటీవల ‘లోకా:చాప్టర్1’(Lokah Chapter 1: Chandra)మూవీతో బాక్సాఫీసును షేక్ చేసింది.

దిశ, సినిమా: మలయాళ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan)ఇటీవల ‘లోకా:చాప్టర్1’(Lokah Chapter 1: Chandra)మూవీతో బాక్సాఫీసును షేక్ చేసింది. ఈ సినిమా అన్ని భాషల్లో విపరీతమైన ఆదరణ సొంతం చేసుకుని కలెక్షన్లతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసింది. దీంతో కళ్యాణి ప్రియదర్శన్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం కళ్యాణి పలు చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ఈక్రమంలో.. తాజాగా, కళ్యాణి ప్రియదర్శన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘లోకా: చాప్టర్1లో నన్ను సూపర్ హీరోగా ప్రేక్షకులు అంగీకరిస్తారో లేదో అని చాలా భయపడ్డాను.
అందుకే సినిమా విడుదలై రివ్యూలు వచ్చేదాక గదిలోంచి బయటకు రాలేదు. నేనొక్కదాన్నే కాకుండా మా టీమ్ మొత్తం చాలా టెన్షన్ పడ్డాం. మేము ఎంత భయపడ్డామో అంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకుల నుంచి ఇంత ఆదరణ లభిస్తుందని అస్సలు ఊహించలేదు. రివ్యూలు చూశాక మా ఆందోళన మొత్తం మాయమైంది. రెస్సాన్స్ ఎలా ఉన్నా విమర్శలు రాకుండా ఉంటే చాలని భావించాం. మధ్యాహ్నం 3గంటల తర్వాత అందరం గదిలోంచి బయటకు వచ్చి సంబరాలు చేసుకున్నాం. అన్నింటికంటే ముఖ్యంగా, మేమందరం డొమినిక్‌పై నమ్మి ఈ ప్రాజెక్ట్ చేశాం. ఆ నమ్మకం లేకుండా ఈ సినిమా సాధ్యమయ్యేది కాదు.
ఇంటర్వెల్ సన్నివేశం తప్ప, మేము చిత్రీకరించిన ప్రతిదీ స్క్రిప్ట్ ప్రకారమే ఉంది. ఇంటర్వె్ల్ సీన్‌ను డొమినిక్ అప్పటికప్పుడు వచ్చిన ఐడియా. కానీ సినిమా విడుదల తర్వాత ఇప్పటికీ అందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు’’ అని చెప్పింది. కాగా.. ప్రస్తుతం ఈ అమ్మడు ప్రజెంట్ ‘లోకా:చాప్టర్1’కు సీక్వెల్ చేస్తోంది. డొమినిక్ అరుణ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సీక్వెల్‌లో టోవినో థామస్, దుల్కర్ సల్మాన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ అయింది. అప్డేట్స్ ఎప్పుడొస్తాయా? అనే ఆసక్తి నెలకొంది.






