- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రెస్టారెంట్‌లో ఓ డైరెక్టర్ అలా చేయమన్నారు.. నాకు ధైర్యం సరిపోలేదు.. ఇషా తల్వార్ షాకింగ్ పోస్ట్
బాలీవుడ్ నటి ఇషా తల్వార్(Isha Talwar) ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించింది.

నిమా: బాలీవుడ్ నటి ఇషా తల్వార్(Isha Talwar) ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక ఇటీవల ‘ఓరు జాతి జాతకం’ (Oru Jaathi Jaathakam)మలయాళ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. తాజాగా, ఈ అమ్మడు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. గతంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకుంది. ‘‘ఓ ఆడిషన్ కోసం యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థకు కాస్టింగ్ డైరెక్టర్ షనూ శర్మను కలిశాను. ముంబైలోని వెర్సోవాలో ఓ రెస్టారెంట్‌లో సీన్ చేయాలని నన్ను తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లి అందరి మధ్యలో గట్టిగా ఏడవాలని చెప్పారు. ఎటువంటి సన్నివేశాలకు అభ్యంతరం చెప్పకూడదని అన్నారు. రెస్టారెంట్‌లో నా ముందే కూర్చున్నారు. అందరూ భోజనం చేస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు. రద్దీగా ఉన్న రెస్టారెంట్‌లో నన్ను ఏడ్వమని చెప్పేసరికి నాకు అంతా అయోమయంగా అనిపించింది.
అలా చేసేందుకు ధైర్యం సరిపోలేదు. ఒక అమ్మాయిని అంత మందిలో ఏడిపించడటం దేనికో నాకు అర్థం కాలేదు. ఆఫీసులో ఆడిషన్ పెట్టుకోవాలి కానీ జనాల మధ్యలోనా అనిపించింది. ఏదేమైనా ఇది దాదాపు పదేళ్ల కిందట జరిగిన సంఘటన. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే వాళ్ల కోసం ఈ స్టోరీ పెడుతున్నాను. ఆడిషన్‌కు వెళ్లినప్పుడు ఎవరూ ఒత్తిడికి గురి కాకూడదు. నేనైతే అలా రెస్టారెంట్‌లో ఏడవనని చెప్పేశాను. ఆ సినిమా అవకాశాన్ని వదులుకున్నాను. చాన్సుల కోసం నేను అలా పదిమందిలో ఏడ్వలేను’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక అది చూసిన నెటిజన్లు కొందరు షాక్ అవుతున్నారు. మరికొందరు ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు.






