ఆ సమయంలో నేను ఎంతగానో నలిగిపోయా.. ఇండస్ట్రీలో మార్పు రావాలంటూ జాన్వీ కపూర్ కామెంట్స్

by Mallepaka Hamsa |

జాన్వీ కపూర్ (Janhvi Kapoor)బాలీవుడ్‌లో అతిలోక సుందరి కూతురిగా ఫుల్ పాపులారిటీ దక్కించుకోవడంతో పాటు గ్లామర్‌తో యూత్‌ను ఫిదా చేసింది.

ఆ సమయంలో నేను ఎంతగానో నలిగిపోయా.. ఇండస్ట్రీలో మార్పు రావాలంటూ జాన్వీ కపూర్ కామెంట్స్
X

దిశ, సినిమా: జాన్వీ కపూర్ (Janhvi Kapoor)బాలీవుడ్‌లో అతిలోక సుందరి కూతురిగా ఫుల్ పాపులారిటీ దక్కించుకోవడంతో పాటు గ్లామర్‌తో యూత్‌ను ఫిదా చేసింది. అలాగే పలు ఈవెంట్స్‌లోనూ పాల్గొంటున్న జాన్వీ తన అనుభవాలు, అభిప్రాయాలను పంచుకుంటూ వార్తల్లో నిలుస్తోంది. ముంబైలో జరిగిన మహిళా శక్తి, సమానత్వంపూ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించగా.. ఇందులో పాల్గొన్న జాన్వీ మాట్లాడిన మాటలు హాట్ టాపిక్‌గా మారాయి. ‘‘నేను ఒక మహిళగా పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది. మహిళలు బలహీనులు కాదు.. శక్తివంతమైన వారు సాహసం కలిగిన వారు. సమానత్వం గురించి మాట్లాడితేనే మార్పు మొదలవుతుంది. నలుగురు మహిళల మధ్య నా అభిప్రాయం నేరుగా చెప్పాలనుకుంటున్నా.

కానీ పురుషులు ఉన్నచోట చాలా జాగ్రత్తగా, వాళ్లు నొచ్చుకోకుండా మాట్లాడాలి. ఈ ఇండస్ట్రీలో మహిళగా ఉన్న నేను ఈ విషయంలో ఎంతగానో నలిగిపోయానో నాకు తెలుసు. ఇండస్ట్రీలో మహిళను చూసే పద్ధతి మారాలి’’ అని చెప్పింది. ఇక ఈ విషయంపై గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా స్పందిస్తూ.. ‘‘ఇలా మాట్లాడే అమ్మాయిలకు మనం మద్దతు ఇవ్వాలి. ఇలాంటి మాటలు మార్పుకు తొలిమెట్టు’’ అని చెప్పింది. ప్రస్తుతం జాన్వీ, ప్రియాంక హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. జాన్వీ ధైర్యాన్ని ప్రశంసిస్తూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి స్టార్స్ మాటల వల్లే ఇండస్ట్రీలో మార్పు వస్తుందని మరికొందరు అంటున్నారు.

Next Story