పొరపాటున పద్మ భూషణ్ అవార్డు ఇచ్చారు.. నాకు ఈ బిరుదులు అలంకారం కాదు.. బాలయ్య ఆసక్తికర కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-06-10 13:04:32  IST  )

నందమూరి బాలకృష్ణ(Balakrishna) ‘అఖండ-2’(Akhanda-2) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

పొరపాటున పద్మ భూషణ్ అవార్డు ఇచ్చారు.. నాకు ఈ బిరుదులు అలంకారం కాదు.. బాలయ్య ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ(Balakrishna) ‘అఖండ-2’(Akhanda-2) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. బోయపాటి శ్రీను(Boyapati Srinu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ‘అఖండ’ సీక్వెల్‌గా రాబోతుంది. అయితే దీనిని సెప్టెంబర్ 25న దసరా సందర్భంగా విడుదల చేయనున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక నేడు (జూన్ 10) బాలయ్య పుట్టిన రోజు కావడంతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘నేను ఈ స్థాయికి రావడానికి కారణమైన మీ ముందు చెప్తున్నాను.

పద్మభూషన్ అవార్డ్ పొరపాటున ఇచ్చారు. అది నా నటనకు ఇచ్చింది కానీ నేను మాత్రం నా సేవకు ఈ అవార్డు ఇచ్చారు అనుకుంటాను. బిరుదులకు నేను అలంకారమేమో అనుకుంటారు. బిరుదులు నాకు అలంకారం కాదు. బిరుదులు వస్తుంటాయి. కానీ మన పని మనం చేసుకుంటూ పోవాలి. నేను మెడిసిన్ ఎంట్రెన్స్ రాశాను. మెడిసిన్ చదవలేదు కానీ.. సినిమాల్లో డాక్టర్ పాత్రలు చేశాను. 15 ఏళ్ల క్రితం బసవతారకం ఆసుపత్రికి ఛైర్మన్ అయ్యాను. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యం అందించేలా కృషి చేస్తున్నాం. ఇకనుంచి బాలకృష్ణ అంటే ఏంటో చూపిస్తాను’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story