డైరెక్టర్ విజన్ చూసి ఫిదా అయ్యా.. ఆ పాత్రను ఒక ఛాలెంజ్‌గా తీసుకున్నానంటున్న కియారా అద్వానీ!

by Mallepaka Hamsa |

నేను ఇప్పటివరకు చదివిన స్క్రిప్ట్‌లలో ‘నాడియా’ పాత్ర చాలా విభిన్నమైనది . డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఈ క్యారెక్టర్‌ను రాసిన విధానం, ఆమె ప్రయాణాన్ని తీర్చిదిద్దిన తీరు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

డైరెక్టర్ విజన్ చూసి ఫిదా అయ్యా.. ఆ పాత్రను ఒక ఛాలెంజ్‌గా తీసుకున్నానంటున్న కియారా అద్వానీ!
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ తల్లి అయిన తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మళ్లీ ‘టాక్సిక్’ మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా యష్ సరసన కియారా రొమాన్స్ చేయనుంది. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై వెంకట్, కె. నారాయణ, యష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్, గ్లింప్స్, పోస్టర్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగా.. విశాల్ మిశ్రా సంగీత సారథ్యంలో వచ్చిన మొదటి పాట ‘తబాహి’ ఆడియో ఇప్పటికే విడుదలై అలరిస్తోంది. తెలుగులో రామజోగయ్య శాస్త్రి ఈ పాటను రాశారు. ప్రస్తుతం ఆడియో మాత్రమే అందుబాటులో ఉండగా, యష్-కియారాల మధ్య చిత్రీకరించిన వీడియో సాంగ్ కోసం ఫ్యాన్స్ కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరీ చూస్తున్నారు.

ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కియారా తన పాత్ర గురించి వివరించి అంచనాలను రెట్టింపు చేసింది. "నేను ఇప్పటివరకు చదివిన స్క్రిప్ట్‌లలో ‘నాడియా’ పాత్ర చాలా విభిన్నమైనది . డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఈ క్యారెక్టర్‌ను రాసిన విధానం, ఆమె ప్రయాణాన్ని తీర్చిదిద్దిన తీరు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ పాత్రను నేను ఒక ఛాలెంజ్‌గా తీసుకున్నాను. గీతూ గారి విజన్ ప్రకారం ఈ పాత్రకు వెండితెరపై ప్రాణం పోయడానికి నేను సిద్ధంగా ఉన్నాను" అని తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. కేవలం గ్లామర్ కోసమే కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర కావడంతో కియారా ఈ ప్రాజెక్టుపై చాలా నమ్మకంగా ఉన్నారు. ఈ చిత్రంలో నయనతార, హుమా ఖురేషి వంటి స్టార్స్ నటిస్తున్న ఈ సినిమా కోసం యష్ స్వయంగా కథా చర్చల్లో పాల్గొనడం విశేషం. ఇక ఈ సినిమా మార్చి 19న విడుదల కావాల్సి ఉండగా..పశ్చిమాసియా దేశాల్లో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో జూన్‌కు వాయిదా వేశారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో జూన్ 4న థియేటర్స్‌లోకి రాబోతుంది.

Next Story