ఆ మూవీలో నేను కమెడియన్‌ని: ప్రభాస్ కామెంట్స్ వైరల్

by Disha Web Desk 9 |
ఆ మూవీలో నేను కమెడియన్‌ని: ప్రభాస్ కామెంట్స్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ ‘ప్రాజెక్ట్-కె’. ఈ చిత్రంలో దీపికా పదుకొణె కథానాయిక. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్, గ్లింప్స్ అమెరికా కామిక్‌లో రిలీజ్ చేశారు. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ చిత్రం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ ఈవెంట్‌లో భాగంగా రెబల్ స్టార్ మాట్లాడుతూ..‘ఈ చిత్రంలో నాగ్ అశ్విన్ నా పాత్రను డిజైన్ చేసిన విధానం నాకు చాలా నచ్చింది. ఇందులో బలమైన ఎమోషన్స్ ఉంటాయి. కానీ ఈ సినిమాలో ఒకే ఒక్క కమెడియన్ ఉంటాడు. అది నేనే’’ అంటూ ప్రభాస్ చెప్పుకొచ్చాడు. ఈ హీరో చెప్పింది నిజమో అబద్దమో తెలియదు కానీ.. ‘ప్రభాస్ లుక్, పోస్టర్లను చూసిన ప్రేక్షకులెవ్వరు ప్రభాస్ ఈ చిత్రంలో కామెడీ చేస్తాడంటే ఎవ్వరు నమ్మరు’ అంటూ నెటిజన్ల కామెంట్లు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఇక ప్రభాస్ ఈ మూవీ కోసం ఏకంగా రూ. 120 కోట్ల రూపాయల రేంజ్‌లో ఛార్జ్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.

Next Story