- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ సినిమా కోసం చెమటోడ్చిన ప్రతి ఒక్కరికీ ప్రశంసలు దక్కాలనుకుంటున్నా.. సాయి పల్లవి ఆసక్తికర ట్వీట్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna), కోలీవుడ్ హీరో ధనుష్, అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘కుబేర’(Kubera).

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna), కోలీవుడ్ హీరో ధనుష్, అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘కుబేర’(Kubera). శేఖర్ కమ్ముల(Shekhar Kammula) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య జూన్ 20న (నేడు) గ్రాండ్‌లో థియేటర్స్‌లో విడుదలైంది. ఇక ఈ సినిమా విజయాన్ని అందుకోవాలని సాయి పల్లవి (Sai Pallavi)ట్విట్టర్ వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ‘‘కుబేర సినిమా ఎంతో ప్రత్యేకంగా ఉండనుంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. సవాలుతో కూడిన పాత్రలను ఎంచుకోవడంలో ఎప్పుడూ ముందుండే ధనుష్ తన నటనతో ప్రేక్షకులను అలరించబోతున్నారు. నాగార్జునను ఇలాంటి అద్భుతమైన పాత్రలో చూడటం అభిమానులకు కనువిందుగా ఉండనుంది. శేఖర్ చేసే సినిమాల్లో హీరోయిన్స్ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుంది. రష్మిక మందన్నా బ్లాక్ బస్టర్స్‌తో ఇండస్ట్రీలో రాణిస్తున్న ఆమె మరో హిట్ అందుకోవాలని కోరుకుంటున్నాను.
ఇక మ్యూజిక్ డైరెక్టర్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మీ కెరీర్‌లో బెస్ట్ అల్బమ్స్‌లో ఇది కూడా చేరాలనుకుంటున్నాను. ఈ సినిమా కోసం చెమటోడ్చిన ప్రతిఒక్కరికీ ప్రశంసలు దక్కాలని కోరుకుంటున్నా. స్వచ్ఛమైన హృదయం, అద్భుతమైన టాలెంట్ కలిగిన వ్యక్తి, నాకెంతో ఇష్టమైన డైరెక్టర్ శేఖర్ కమ్ముల. తన కథలతో ఎంతోమందికి స్ఫూర్తి నింపారు. ఆయన దర్శకత్వంలో సినిమా చేసి పేరు సంపాదించుకున్న వారిలో నేను ఒకదాన్ని. నా గురువు ఇలాంటి అద్భుమైన కథలెన్నో మనకు అందించాలని కోరుకుంటున్నా. టీమ్ అందరి ఆనందం కోసం నేను ప్రార్థిస్తున్నా’’ అని రాసుకొచ్చింది. కాగా ప్రస్తుతం సాయి పల్లవి అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ’ లో కీలక పాత్రలో నటిస్తోంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.






