ఆ స్టార్ హీరో నుంచి అది నేర్చుకోవాలనుకుంటున్నా.. ఆయనే నాకు స్ఫూర్తి : త్రిప్తి డిమ్రీ

by Mallepaka Hamsa |

బాలీవుడ్ యంగ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి(Tripti Dimri) ‘యానిమల్’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ఫుల్ పాపులారిటీ దక్కించుకున్న ఈ భామ వరుస చిత్రాల్లో నటిస్తోంది.

ఆ స్టార్ హీరో నుంచి అది నేర్చుకోవాలనుకుంటున్నా.. ఆయనే నాకు స్ఫూర్తి : త్రిప్తి డిమ్రీ
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి(Tripti Dimri) ‘యానిమల్’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ఫుల్ పాపులారిటీ దక్కించుకున్న ఈ భామ వరుస చిత్రాల్లో నటిస్తోంది. ఇటీవల ‘బ్యాడ్ న్యూజ్, మూవీతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం త్రిప్తి డిమ్రి భారీ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’(Spirit) తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది. పాన్ ఇండియా హీరో ప్రభాస్ (Prabhas)హీరోగా నటిస్తుండగా.. సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్ పోలీస్ పాత్రలో నటిస్తున్నట్లు టాక్. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో పాటు సిద్ధాంత్ చతుర్వేది సరసన ‘ధడక్-2’లోనూ నటిస్తోంది.

ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ ‘ధడక్’సీక్వెల్‌గా రాబోతుంది. దీనిని షాజియా ఇక్బాల్ తెరకెక్కిస్తుండగా.. ధర్మ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ నిర్మిస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు-1 థియేటర్స్‌లోకి రాబోతుంది. దీంతో ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్న త్రిప్తి ఓ ఇంటర్వ్యూలో భాగంగా స్టార్ హీరోపై ప్రశంసలు కురిపించింది. ‘‘నేను చాలా ఓపికగా ఉంటానని అనుకుంటాను కానీ కంట్రోల్ తప్పుతుంటా. ఆ ఓపికను నేను అతని నుంచి నేర్చుకోవాలనుకుంటున్నాను.

కఠినమైన షూటింగ్ షెడ్యూల్‌లో కూడా విక్కీ కౌశల్ అలసిపోకుండా ఉంటారు. అతను ఒక్క మాట మాట్లాడకుండా 24 గంటలపాటు పని చేస్తూనే ఉంటాడు. అది చూసిన నేను ఒక రోజు.. మీరు ఎలాంటి కంప్లైట్ ఇవ్వకుండా ముందుకు సాగుతారు అని అడిగాను. దానికి ఆయన నాకు సినిమాలంటే ఇష్టమని చెప్పారు. అందుకే ఎంతసేపు వర్క్ చేయడానికైనా సిద్ధంగా ఉంటానని అన్నారు. కష్టంగా కాకుండా ఇష్టంగా వర్క్ చేస్తానని చెప్పారు. ఆయన చాలా మంచివాడు.. విక్కీ కౌశల్ నాకు స్ఫూర్తి’’ అని చెప్పుకొచ్చింది.

Next Story