- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లి చేసుకోవాలని ఉంది.. అలా కమిట్ అయ్యానంటూ కాయదు లోహర్ ఆసక్తికర కామెంట్స్
నాకు త్వరలోనే పెళ్లి చేసుకోవాలని ఉంది అని తన మనసులో మాటను బయటపెట్టారు.

దిశ, సినిమా: కోలీవుడ్ యంగ్ బ్యూటీ కాయదు లోహర్ ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ‘డ్రాగన్’ చిత్రంతో సెన్సేషనల్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. తెలుగులో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ది ప్యారడైజ్’ (The Paradise) లో కాయదు హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండటంతో, కాయదు క్రేజ్ తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా పెరిగిపోయింది. దీనితో పాటు తమిళం, మలయాళ భాషల్లో కలిపి ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉండటం విశేషం. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్,పెళ్లి గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
మీరు కమిటెడా? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు కాయదు చాలా ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు. ‘‘నేను ప్రస్తుతం సింగిల్‌గానే ఉన్నాను. కానీ నా వర్క్‌తో మాత్రం గట్టిగా కమిట్ అయిపోయాను. అయితే, నాకు త్వరలోనే పెళ్లి చేసుకోవాలని ఉంది" అని తన మనసులో మాటను బయటపెట్టారు. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే పెళ్లి గురించి ఇలా ఓపెన్‌గా మాట్లాడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. కాయదు చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. "పెళ్లి చేసుకోవాలని ఉందంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు మనసులో ఉండి ఉంటారు" అని కొందరు అంటుంటే, "అంత అందగత్తె సింగిల్‌గా ఉందంటే నమ్మశక్యంగా లేదు" అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమె రిలేషన్‌షిప్ స్టేటస్‌పై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. ఏదేమైనా, తన నటనతోనే కాకుండా తన పర్సనల్ లైఫ్ విషయాలతోనూ కాయదు వార్తల్లో నిలుస్తోంది.






