- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలీవుడ్‌పై కన్నేసిన రుక్మిణి వసంత్.. చాలా ఎక్జైటింగ్‌గా ఉన్నానంటూ ఆసక్తికర కామెంట్స్
కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్(Rukmini Vasanth) అతి తక్కువ సమయంలోనే ఫుల్ ఫేమ్ సంపాదించుకుంది.

దిశ, సినిమా: కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్(Rukmini Vasanth) అతి తక్కువ సమయంలోనే ఫుల్ ఫేమ్ సంపాదించుకుంది. తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో హిట్ చిత్రాల్లో నటించి క్రేజీ బ్యూటీగా మారిపోయింది. ఇటీవల ‘కాంతార చాప్టర్-1’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ భామకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం కథలు వింటున్న రుక్మిణి వసంత్.. బాలీవుడ్ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తోంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రుక్మిణి వసంత్ తనకు హిందీ భాషపై ఉన్న మక్కువను వెల్లడించింది. ‘‘కాంతార’లో కనకవతి పాత్ర తర్వాత నాకు చాలా అవకాశాలు వస్తున్నాయి. నాతో చాలామంది చర్చలు జరుపుతున్నారు.
నా తదుపరి ప్రాజెక్ట్ కోసం నేను చాలా ఎక్జైటింగ్‌గా ఉన్నాను. హిందీలో నటించాలని ఆశపడుతున్నాను. హిందీ నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన భాష. ఎప్పుడూ హిందీ సినిమాలతో పరిచయం ఉండేది. బహుశా ఇది సైనిక నేపథ్యం వల్ల కావచ్చు. ఎందుకంటే ప్రతి కంటెన్మెంట్‌ను మరొకదానితో కలిపే వారధి హిందీ. నా విషయంలో అది అక్కడే మొదలై ఉండాలి. హిందీలో నా నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి నేను చాలా ఉత్సాహంగా ఉన్నా. ఆ భాషతో భావోద్వేగాలను పలికించే అవకాశం నాకు ఇంకా రాలేదు. దేవుడి దయ వల్ల నేను త్వరలోనే హిందీలో నా ప్రయాణాన్ని ప్రారంభిస్తానని అనుకుంటున్నాను. ఈ సంవత్సరం జరిగిన అద్భుతాలన్నింటినీ నేను గుర్తు చేసుకుంటున్నాను. ఇప్పటివరకు సెట్‌లో, పని చేస్తూ పుట్టినరోజు జరుపుకునే అదృష్టం నాకు లభించలేదు. రాబోయే రోజుల్లో అలా జరగబోతున్నందుకు నేను ఉత్సాహంగా ఉన్నాను’’ అని చెప్పుకొచ్చింది.
ఇప్పటికే ఓ హిందీ సినిమాలో నటించిన ఈ అమ్మడు మరికొన్ని ప్రాజెక్ట్స్ చేయాలని ఆసక్తి చూపిస్తోంది. కాగా.. ప్రస్తుతం రుక్మిణి వసంత్ ‘టాక్సిక్’ మూవీలో నటిస్తోంది. యష్ హీరోగా చేస్తుండగా.. నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి గీతు మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తుండగా.. కెవిఎన్ ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 19న పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది.






