- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అలాంటి చిత్రాల్లో నటించాలనిపిస్తోంది.. తన కోరిక బయటపెడుతూ యంగ్ బ్యూటీ షాకింగ్ ట్వీట్!
టాలీవుడ్ యంగ్ బ్యూటీ కోమలి ప్రసాద్(Komali Prasad) నేచురల్ స్టార్ నాని ‘హిట్-3’ (hit-3)మూవీతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ కోమలి ప్రసాద్(Komali Prasad) నేచురల్ స్టార్ నాని ‘హిట్-3’ (hit-3)మూవీతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ప్రస్తుతం కోమలి ప్రసాద్ ‘శశివదనే’(Sasivadane) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా అక్టోబర్ 10న థియేటర్స్‌లోకి రాబోతుంది. దీంతో ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్న కోమలి సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా, కోమలి ప్రసాద్‌ను ఉద్దేశిస్తూ ఓ నెటిజన్.. ‘‘హిట్-3 లో సహాయక నటిగా కనిపించారని మీరు ఎప్పుడూ బాధపడకండి. పోలీస్‌గా నటించే అవకాశం చాలా తక్కువమందికి వస్తుంది. మీరు ఆ పాత్రలో బాగా నటించారు. సాధారణంగా గ్లామర్ క్యారెక్టర్స్ చేయకుండా లేజెండ్ పాత్రలో చేశారు’’ అని పెట్టాడు.
ఇక దానికి కోమలి ప్రసాద్ స్పందిస్తూ.. ‘‘ఒక స్టార్ హీరోతో పాటు పోలీస్ పాత్రలో కనిపించడం చాలా పెద్ద విషయం. అలాంటి అవకాశం రావడం చాలా అరుదు. ఆ విషయం ప్రేక్షకులకు కూడా తెలుసు. కానీ నేను హిట్ ఫ్రాంఛైజీతో ఎంతోమంది ప్రేక్షకులకు చేరువయ్యాను. ‘హిట్-3’లో నటించిన తర్వాత నేను విభిన్నమైన పాత్రలు కూడా పోషించగలనని నాపై నాకు నమ్మకం కలిగింది. అలాగే ఐకానిక్ మార్షల్ ఆర్ట్స్ రివైంజ్ డ్రామా ‘కిల్ బిల్’ పూర్తి స్థాయి యాక్షన్ చిత్రాల్లోనూ నటించాలని అనిపిస్తోంది. అవకాశం వస్తే కచ్చితంగా నా నెక్ట్స్ ప్రాజెక్ట్ అదే అవుతుంది. దానికోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ రెండు పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.






