షారుఖ్‌తో ఛాన్స్ అంటే ఫ్రాంక్ అనుకున్నాను: బిగ్ బాస్ బ్యూటీ కామెంట్స్ వైరల్

by Disha Web Desk 9 |
షారుఖ్‌తో ఛాన్స్ అంటే ఫ్రాంక్ అనుకున్నాను: బిగ్ బాస్ బ్యూటీ కామెంట్స్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్.. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ థ్రిల్లర్ ‘జవాన్’. ఈ సినిమాతో సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా బాలీవుడ్‌కు పరిచయమయ్యింది. ప్రియమణి, సన్యా మల్హోత్రా, సనీల్ గ్రోవర్, దీపికా పదుకొణె కీలక పాత్రల్లో నటించగా.. విజయ్ సేతుపతి విలన్‌గా నటించాడు. ఇందులో షారుఖ్ పక్కన బిగ్‌బాస్ బ్యూటీ సిరి హనుమంతు కనిపించడంతో తెలుగు ప్రేక్షకులందరూ ఒక్కసారిగా సర్ప్రైజ్ అయ్యారు. జైలర్ అజాద్‌గా షారుఖ్ నటిస్తే.. ఆయనకు సబ్ ఆర్డినేట్‌ ఆఫీసర్‌ పాత్రలో సిరి నటించింది.

తాజాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూకు హాజరై.. ‘ఈ సినిమాలో అవకాశం కోసం నాకు ఫోన్ రాగానే నేను ఫ్రాంక్ కాల్ అనుకున్నాను. షారుఖ్ చిత్రంలో నాకు ఛాన్స్ రావడం ఏంటి? సందేహంలోనే ఉన్నాను. తర్వాత దర్శకుడు అట్లీతో మాట్లాడాక అసలు విషయం అర్థమయ్యింది. షూటింగ్ సమయంలో నేను సరిగ్గా చెప్పక 7 టేకులు తీసుకున్నాను. దీంతో అట్లీ కాస్త అసంతృప్తి చెందారు. కానీ షారుఖ్ నాకు ధైర్యం చెప్పి ప్రోత్సహించారు. ఆయనతో పనిచేయడం నాకు ఒక మంచి ఎక్స్‌పీరియన్స్. అవకాశం ఎప్పుడు ఎక్కడ ఎటు నుంచైనా రావొచ్చు. మనం చేయాల్సిన ప్రయత్నం మాత్రం ఆపకూడదు.’’ అంటే సిరి చెప్పుకొచ్చింది.

Read More..

అట్లీపై నయనతార సీరియస్.. ఆ సినిమాల్లో నటించొద్దని సంచలన నిర్ణయం

Next Story