- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిజాలు నా కళ్లారా చూశా.. అయినప్పటికీ వారికి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది: బండి సరోజ్ కుమార్
రోషన్ కనకాల(Roshan Kanakala) నటించిన మూవీ ‘మోగ్లీ’ (Mowgli)విడుదలకు సిద్ధమైంది.

దిశ, సినిమా: రోషన్ కనకాల(Roshan Kanakala) నటించిన మూవీ ‘మోగ్లీ’ (Mowgli)విడుదలకు సిద్ధమైంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై రాబోతున్న ఈ చిత్రానికి సందీప్ రాజ్ (Sandeep Raj)దర్శకత్వం వహిస్తున్నారు. బండి సరోజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. ఇందులో పాల్గొన్న బండి సరోజ్ కుమార్ పలు వ్యాఖ్యలు చేశాడు. అవి కాస్త వివాదాస్పదమయ్యాయి. అసలు ఆయన ఏమన్నారంటే.. సెన్సార్ బోర్డు అధికారి నా నటన కారణంగా భయపడిపోయి మా సినిమాకు ‘A’సర్టిఫికెట్ ఇచ్చాడు.
నేను ఒక ‘రూత్‌లెస్‌కాప్’ పాత్రలో నటించినట్లు అనిపించలేదు. నటన నన్ను భయపెట్టింది కాబట్టి మా చిత్రానికి A సర్టిఫికెట్ వచ్చిందని సందీప్ రాజ్ అన్నారని వివరించాడు. ఇక ఈ కామెంట్లు కాస్త వివాదానికి దారితీశాయి. దీంతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సెన్సార్ బోర్డుకు క్షమాపణలు చెప్పారు. బండి సరోజ్ కుమార్ అనుకోకుండా అలా అన్నారని వివరణ ఇచ్చింది. తాజాగా, ఈ విషయంపై బండి సరోజ్ కుమార్ ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ‘‘ ఈ సినిమాని నా బాధ్యతగా తీసుకున్నాను. నిర్మాత నా కళ్ళ ముందే డబ్బును భారీగా ఖర్చుపెట్టడం నా కళ్లారా చూశాను.
దానికి నా వంతు కృషిగా నా సొంత సినిమా కంటే గట్టిగా, నా ఇంట్రోవర్ట్ బిహేవియర్ నుండి బయటకు వచ్చి ఆల్ ఔట్ ప్రమోషన్ చేశాను. సెన్సార్ బోర్డు వాళ్లు క్షమాపణ కావాలి అన్న డిమాండ్ ను సినిమాకు ఆటంకం కలగకుండా ఉండడం కోసం నెరవేర్చాను. రేపే ప్రీమియర్లు. ఒరిజినల్ రివ్యూలు ప్రేక్షకులు ఇస్తారు. అక్కడి నుండీ ఆ సినిమా కంటెంట్ ఏ ముందుకు తీసుకెళ్లాలి. ఇంతటితో నా పని పూర్తి. మోగ్లీ చూశాక నచ్చితే గట్టిగా ముందుకు తీసుకెళ్లండి’’ అని రాసుకొచ్చాడు. దీంతో వివాదానికి కాస్త చెక్ పడినట్లు అయింది.






