నాతో ఒక్క సినిమా చేయమని ఆ డైరెక్టర్‌ను అడుక్కున్నా.. మెగా హీరో ఎమోషనల్ కామెంట్స్

by Mallepaka Hamsa |

మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) ‘సంబరాల ఏటి గట్టు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

నాతో ఒక్క సినిమా చేయమని ఆ డైరెక్టర్‌ను అడుక్కున్నా.. మెగా హీరో ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) ‘సంబరాల ఏటి గట్టు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన కెరీర్‌లో 18వ ప్రాజెక్ట్‌గా రాబోతుండగా.. రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్నారు. ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lakshmi) హీరోయిన్‌గా నటిస్తోంది. 1947 హిస్ట‌రీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం తెర‌కెక్కుతున్న‌ట్లుగా తెలుస్తోంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ‌ర‌వేగంగా ఈ చిత్ర షూటింగ్ జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఈవెంట్‌లో పాల్గొన్న సాయి ధరమ్ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ‘‘డైరెక్టర్ దేవాకట్టా(Deva Katta )తో పదేళ్ల నుంచి పరిచయం ఉంది.

‘ఆటోనగర్ సూర్య’ సినిమాలో ఆయన వాయిస్ నాకు నచ్చింది. దీంతో వెంటనే ఆయనకు ఫోన్ చేసి నన్ను నేను పరిచయం చేసుకున్నాను. ఆ తర్వాత జిమ్‌లో కలుసుకునేవాళ్లం. ఈ సమయంలోనే నాతో ఓ సినిమా చేయాలని పదే పదే అడుక్కున్నా. అలా చేస్తుండగా.. 2021లో ఆయన నాతో ‘రిపబ్లిక్’ చేశారు. కానీ నా జీవితాన్ని మార్చేసిన ఘటన అదే సమయంలో జరగడంతో చాలా బాధపడ్డాను. కష్ట సమయంలో దేవకట్టా నా వెన్నంటే ఉన్నారు. ‘రిపబ్లిక్’ క్లైమాక్స్‌ను అందుకే నాకు నచ్చినట్లుగా తీశారు’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా.. దేవకట్టా తెరకెక్కించిన ‘మాయసభ’ ట్రైలర్ లాంచ్‌లో సాయి ధరమ్ తేజ్ గెస్ట్‌గా పాల్గొన్నారు.

Next Story