- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్టార్ హీరోలతో నటించి రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నా.. ఇకపై అలాంటి మూవీస్ చేయను: అనూ ఇమ్మాన్యుయేల్
తెలుగులో స్టార్ హీరోల చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుని ఇండస్ట్రీలో కొనసాగుతోంది.

దిశ, సినిమా: తెలుగులో స్టార్ హీరోల చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుని ఇండస్ట్రీలో కొనసాగుతోంది. పలు హిట్స్‌ను తన ఖాతాలో వేసుకున్న అనూ ఇమ్మాన్యుయేల్ (Anu Emmanuel)రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోంది. మళ్లీ ‘ది గర్ల్ ఫ్రెండ్’ (The Girlfriend)చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఇందులో హీరోయిన్‌గా కాకుండా సహనటిగా చేసి తన నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనూ స్టార్ హీరోలతో నటించి ఫీల్ అవుతున్నట్లు తెలిపింది. ‘‘నటిగా సంతృప్తి ఉన్నప్పటికీ.. నేను నా సినీ ప్రయాణం పట్ల చాలా అసంతృప్తిగా ఉన్నా.
పవన్ కళ్యాణ్, నాని, అల్లు అర్జున్, కార్తీ, శివ కార్తికేయన్ వంటి స్టార్ హీరోలతో నటించా. అయినా నా కెరీర్‌లో కొన్ని సినిమాలు చేసి ఉండకూడదని ఇప్పుడు రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నా. కొన్ని కమర్షియల్ చిత్రాల్లో నటించడం వల్ల నటిగా నాకు ఎలాంటి సంతృప్తి రాలేదు. మనం ఎక్కువగా కనిపించే స్కోప్ ఉండదు కాబట్టి.. మొత్తంలో మనకి గుర్తింపు రాకుండా చేస్తారు. అందుకే ఇకపై అలాంటి సినిమాలే చేయను. నా పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే చేయాలని నిర్ణయించుకున్నాను.
ప్రస్తుతం కొన్ని కథలు వింటున్నా.. ఓ సినిమా ఓకే చేశాను. త్వరలోనే దాని పూర్తి వివరాలు వెల్లడిస్తాను’’ అని చెప్పుకొచ్చింది. కాగా.. త్వరలో అనూ ‘బూమరాంగ్’ (Boomerang)చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినినిమాకు ఆండ్రీవ్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. బిగ్ మూవీ మేకర్స్ లిమిటెడ్, మైత్రీ ఆర్ట్స్ బ్యానర్స్‌పై లండన్ గణేశ్ నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం విడుదల తేదీని ఖరారు చేసుకోలేదు.






