నేను మీకు మాటిస్తున్నా.. మీరంతా డ్యాన్స్ చేస్తారు.. ‘కూలీ’ మూవీపై హైప్ పెంచిన పూజా హెగ్డే (పోస్ట్)

by Mallepaka Hamsa |   (  Updated:2025-07-17 13:03:01  IST  )

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కూలీ’(coolie).

నేను మీకు మాటిస్తున్నా.. మీరంతా డ్యాన్స్ చేస్తారు.. ‘కూలీ’ మూవీపై హైప్ పెంచిన పూజా హెగ్డే (పోస్ట్)
X

దిశ, సినిమా: కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కూలీ’(coolie). లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), ఉపేంద్ర , శృతి హాసన్, సత్యరాజ్, ఆమిర్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తుండగా.. పూజా హెగ్డే ఐటెం సాంగ్‌లో కనిపించబోతుంది. ఇక ఇటీవల విడుదలైన ఈ సాంగ్ సూపర్ రెస్సాన్స్‌ను దక్కించుకుంది. అత్యధిక వ్యూస్‌ను రాబడుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈనేపథ్యంలో.. తాజాగా, పూజా హెగ్డే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ‘‘కూలీ మోనికా పాటపై మీరు చూపిస్తోన్న ప్రేమాభిమానానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా కెరీర్‌లో ఎంతగానో శ్రమించిన పాట ఇది. విపరీతమైన వేడి, ఎండ, దుమ్ము అని పట్టించుకోకుండా షూట్ చేశాం.

కాలు బెణికిన తర్వాత నేను చేసిన ఫస్ట్ సాంగ్ అయినప్పటికీ నా బాధను స్క్రీన్‌పై కనిపించకుండా కేవలం గ్లామరస్‌గానే ప్రేక్షకులను అలరించేందుకు కష్టపడ్డాను. మోనికా పాట కొసం నా బెస్ట్ ఇచ్చాను. థియేటర్స్‌లో చూపినప్పుడు ఇది తప్పకుండా అద్భుతంగా ఉంటుంది. నేను మీకు మాటిస్తున్నా. మీరంతా డ్యాన్స్ చేస్తారు. ఈ టాస్క్‌లో నాకు సపోర్ట్‌గా నిలి డ్యాన్సర్లకు థాంక్యూ చెబుతున్నాను. అయితే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ పాట షూటింగ్ మహాశివరాత్రి నాడు చేశాం. ఆ రోజు నేను ఉపవాసం ఉండి షూట్‌లో పాల్గొన్నాను. నా టీమ్ నాకు సపోర్ట్ చేయడం వల్ల ఈ పాట ఇంత అద్భుతంగా వచ్చింది’’ అని రాసుకొచ్చింది. అలాగే షూటింగ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది. ఇక వాటిని చూసిన నెటిజన్లు ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తున్నారు.

Next Story