ప్రాణం పెట్టి పనిచేశాను.. కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కిందంటూ ‘వారణాసి’ అప్డేట్ ఇచ్చిన పృథ్వీరాజ్ సుకుమారన్

by Mallepaka Hamsa |

ఈ షెడ్యూల్ కోసం నేను ప్రాణం పెట్టి పనిచేశాను. నా కష్టానికి ప్రతిఫలంగా ఈ చీట్ మీల్ దక్కింది.

ప్రాణం పెట్టి పనిచేశాను.. కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కిందంటూ ‘వారణాసి’ అప్డేట్ ఇచ్చిన పృథ్వీరాజ్ సుకుమారన్
X

దిశ, సినిమా: దర్శకధీరుడు రాజమౌళి సినిమా అంటేనే నటీనటులకు ఒక అగ్నిపరీక్షలాంటిది. ప్రాణం పెట్టి పనిచేస్తే తప్ప జక్కన్నను మెప్పించడం సాధ్యం కాదు. మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నారు. రాజమౌళి - మహేష్ బాబు కాంబోలో రాబోతున్న గ్లోబల్ అడ్వెంచర్ ‘వారణాసి’ కోసం పృథ్వీరాజ్ తన రక్తాన్ని, చెమటను ధారపోశారు. తాజాగా ఈ సినిమాలోని తన షెడ్యూల్ పూర్తి చేసుకున్న పృథ్వీరాజ్, ఇన్నేళ్ల కఠినమైన డైట్‌కు బ్రేక్ ఇస్తూ అదిరిపోయే విందుతో వార్తల్లో నిలిచారు. ఈ క్రేజీ ప్రాజెక్టులో పృథ్వీరాజ్ రానా కుంభ అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ పాత్ర కోసం డైట్ ఫాలో అవుతున్న ఆయన, షూటింగ్ పూర్తయ్యాక తన ఆకలిని తీర్చుకున్నారు. "ఈ షెడ్యూల్ కోసం నేను ప్రాణం పెట్టి పనిచేశాను.

నా కష్టానికి ప్రతిఫలంగా ఈ 'చీట్ మీల్' దక్కింది. థియేటర్స్‌లో కలుసుకుందాం" అంటూ ఒక అదిరిపోయే ఫోటోను షేర్ చేశారు. ఇందులో పచ్చిమిర్చి, వేయించిన జీడిపప్పుతో కూడిన ఘాటైన రొయ్యల వేపుడు, రైస్ ఉన్నాయి. ఈ స్పెషల్ మీల్ పంపిన నారాయణ గారికి పృథ్వీరాజ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాగా.. మహేష్ బాబు రుద్రగా, ప్రియాంక చోప్రా మందాకినిగా నటిస్తున్న ఈ పాన్-వరల్డ్ వండర్‌కు ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం ఏప్రిల్ 7, 2027న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. శ్రీ దుర్గా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాయడం ఖాయమని మహేష్ అభిమానులు అంచనా వేస్తున్నారు.

Next Story