అలా నేనెప్పుడూ అనుకోలేదు.. ఇండస్ట్రీకి నా అవసరం అస్సలు లేదంటూ హనీ రోజ్ కీలక వ్యాఖ్యలు

by Mallepaka Hamsa |   (  Updated:2025-11-17 09:36:16  IST  )

బాలయ్య ‘వీర సింహారెడ్డి’ సినిమాతో హనీ రోజ్(Honey Rose) ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. తమిళ, మలయాళ, హిందీ చిత్రాల్లో నటించి మెప్పించింది.

అలా నేనెప్పుడూ అనుకోలేదు.. ఇండస్ట్రీకి నా అవసరం అస్సలు లేదంటూ హనీ రోజ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, సినిమా: బాలయ్య ‘వీర సింహారెడ్డి’ సినిమాతో హనీ రోజ్(Honey Rose) ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. తమిళ, మలయాళ, హిందీ చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగులో ఒక్క సినిమాతో అమ్మడు రేంజ్ మారిపోయింది. కానీ ఆ తర్వాత ఎలాంటి అవకాశాలు రాకపోవడంతో రెండేళ్ల పాటు ఇండస్ట్రీకి కాస్త గ్యాప్ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ ‘రాహెల్’ (Rachel)సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయనుంది. వినాయన్ (Vinayan)దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో రోషన్ బషీర్, రాధికా రాధాకృష్ణన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ మూవీ డిసెంబర్ 6న థియేటర్స్‌లోకి రాబోతుంది.

ఈక్రమంలో.. తాజాగా, ప్రమోషనల్ కంటెంట్ పెంచుకునేందుకు మూవీ మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న హనీ రోజ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘మలయాళ ఇండస్ట్రీకి నా అవసరం ఉందా? అని నన్ను అడిగితే లేదనే చెప్తాను. నేనే ఈ ఇండస్ట్రీకి గట్టిగా అతుక్కుపోయాను. నేను సినిమా ఇండస్ట్రీకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలవుతోంది. దర్శకుడు వినాయన్ సర్ మొదటి నుంచి నా వెన్నంటే ఉంటున్నారు. ‘రాహెల్’ సినిమాతో నా కెరీర్‌ టర్న్ అవుతుందని అనుకుంటున్నారు. నాకు బోలేడన్ని అవకాశాలు రావాలి.. వచ్చినవన్నీ చేసుకుంటూ పోవాలని నేనెప్పుడూ అనుకోలేదు. వచ్చినవాటిల్లో ఉత్తమమైన వాటినే ఎంపిక చేసుకోవాలనుకుంటున్నా. వాటికోసమే కష్టపడతాను. సినిమా అంటే నాకు అంత పిచ్చి’’ అని చెప్పుకొచ్చింది.

Next Story